అందాల ముద్దుగుమ్మ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.
పెళ్లిసందడి సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే టాలీవుడ్‌లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.
తర్వాత వరసగా ఆఫర్స్ అందుకొని, టాలీవుడ్‌నే షేక్ చేసింది. మరీ ముఖ్యంగా, తన డ్యాన్స్‌తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది ఈ చిన్నది.
ధమాక సినిమాతో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ అందుకున్న ఈ బ్యూటీ తర్వాత మహేష్ బాబు గుంటూరు కారం, స్కంద వంటి సినిమాల్లో నటించింది.
ఇక ఈ మధ్య ఈ అమ్మడు చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలిపోయాయి. దీంతో ఈ బ్యూటీకి ఆశించిన రేంజ్‌లో అవకాశాలు రావడంలేదు.
దీంతో కోలీవుడ్, బాలీవుడ్ పై కన్నేసిన ఈ ముద్దుగుమ్మ అక్కడ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ క్యూటీ.
వరస ఫొటో షూట్‌తో కుర్రారను మాయ చేస్తుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన లేటెస్ట్ ఫొటో షూట్‌తో యూత్‌ను ఆకట్టుకుంది.
బ్లాక్ కలర్ డ్రెస్ ధరించి అందాల ఆరోబోసింది.ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో క్యూట్ అంటూ తన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.