అందం కోసం కోట్లు ఖర్చుపెట్టిన స్టార్ బ్యూటీస్ వీరే!

samatha 

24 February 2025

Credit: Instagram

హీరోయిన్‌గా ఇండస్ట్రీలో తమ సత్తా చాటాలి అంటే టాలెంట్ ఉంటేనే సరిపోదు. మంచిగ్లామర్, అదృష్టం కూడా ఉండాలి.

అయితే ఇప్పటికీ వెండితెరపై స్టార్ హీరోయిన్స్‌గా తమ పేరును నిలుపుకున్న చాలా మంది బ్యూటీస్ అందం కోసం కోట్లు ఖర్చు పెట్టారంట. వారు ఎవరంటే?

అందాల ముద్దుగుమ్మ త్రిష తాను ఇంకా అందంగా కనిపించడానికి తన ముక్కుకు సర్జరీ చేసుకుందంట. దీని కోసం ఈ బ్యూటీ ఏకంగా మూడు కోట్లు ఖర్చు పెట్టిందంట.

లేడీ సూపర్ స్టార్ నయనతార అందం కోసం ఏకంగా నాలుగు కోట్లు ఖర్చు పెట్టి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లు సమాచారం.

శృతిహాసన్ కూడా ఇండస్ట్రీలోకి వచ్చిన కొన్ని రోజుల తర్వాత అందం కోసం మూడుకోట్లకుపైగా ఖర్చు పెట్టి తన ముక్కుకు సర్జరీ చేయించుకున్నదంట.

శ్రేయ తన పెదవులు అందంగా కనిపించడానికి దాదాపు రూ.3 కోట్లు ఖర్చు పెట్టి సర్జరీ చేయించుకున్నట్లు సమాచారం.

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత కూడా తన పెదవులు మరింత అందంగా కనిపించడానికి దాదాపు కోటి రూపాయలకు పైగా ఖర్చు పెట్టి పెదవుల సర్జరీ చేయించుకున్నట్లు వార్తలు వచ్చాయి.

శ్రీదేవి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈమె అందానికి ఎవరైనా ఫిదా అవుతారు. అయితే ఈ బ్యూటీ కూడా రెండు కోట్లు పెట్టి కళ్లు, ముక్కుకు సర్జరీ చేయించుకున్నదంట.