మర్యాద రామన్న సినిమాలోని ఈ కుర్రాడు, టాలీవుడ్ క్రేజీ హీరో అని తెలుసా?

samatha 

23 February 2025

Credit: Instagram

రాజమౌళి దర్శకత్వంలో సునీల్ హీరోగా తెరకెక్కిన మర్యాద రామన్న మూవీ 2010లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. 

ఈ మూవీలో సునీల్ హీరోగా నటించగా, సలోని హీరోయిన్‌గా నటించింది. కామెడీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోగా వెలుగొందుతున్న ఒక నటుడు ఇదే మర్యాద రామన్న సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించాడు.

ఇంతకీ అతనెవరు అనేగా మీ ఆలోచన.. పై ఫొటోలో సునీల్ పక్కనున్నది అతనే. సినిమాలో సునీల్ కు నాగినీడు ఇంటికి దారిచూపే రాయలసీమ కుర్రాడు ఓబులేశ్ పాత్రలో కొద్ది సేపు అలా కనిపిస్తాడు.

అప్పటి ఆ చైల్డ్ ఆర్టిస్టే, నేడు టాలీవుడ్ క్రేజీ హీరో. మరి అతనెవరో గుర్తు పట్టారా? మర్యాద రామన్నతో పాటు పలు సినిమాల్లో ఛైల్డ్ ఆర్టిస్టుగా కనిపించిన ఈ హీరో ఎవరో కాదు శ్రీ సింహా కోడురి.

మత్తు వదల సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ కుర్రాడు. తర్వాత  తెల్లవారితే గురువారం, ఉస్తాద్, భాగ్ సాలే  వంటి చాలా చిత్రల్లో హీరోగా చేశారు.

శ్రీ సింహా మర్యాదరామన్న సినిమాలోనే కాకుండా, విక్రమార్కుడు, యమదొంగ వంటి పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు.

ఇక ఈ మధ్యనే ఈ క్రేజీ హీరో మురళి మోహన్ మనవరాలిని వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నట్లు సమాచారం.