హోలీ రోజే చంద్రగ్రహణం.. ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!

samatha 

28 February 2025

Credit: Instagram

మార్చి 14 శుక్రవారం రోజున తేదీన చంద్రగ్రహణం ఏర్పడనుంది. మొత్తం ఆరుగంటల వ్యవధితో సంపూర్ణ చంద్రగ్రహణం పూర్తవుతుంది.

ఇక హోలీ పండుగ రోజే చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ రోజు సూర్యుడు పాలించే సింహరాశిలోకి చంద్రగ్రహం ప్రవేశింస్తుంది.

దీంతో మూడు రాశుల వారికి అనేక ప్రయోజనాలు కలగనున్నాయంటున్నారు పండితులు. కాగా, ఆ మూడు రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

మిథున రాశి వారికి చంద్రగ్రహణం వలన అద్భుతమైన లాభాలు కలుగుతాయి. చాలా రోజులుగా వసూలు కానీ మొండి బాకీలు వసూలు అవుతాయి.

ఆరోగ్యం బాగుంటుంది, ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ప్రయాణంలో జాగ్రత్త అవసరం, వ్యాపారస్తులు అనేక లాభాలు పొందుతారు.

చంద్రుడి సంచారంతో సింహ రాశి వారికి ఆర్థికంగా, ఉద్యోగపరంగా కలిసి వస్తుంది. అంతే కాకుండా వీరు ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు.

అయితే వీరికి చంద్రుడి సంచారంతో అదృష్టం కలిసి వచ్చినా, చంద్రగ్రహణం ఎఫెక్ట్ వలన అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అంటున్నారు నిపుణులు.

వృశ్చిక రాశి వారికి చంద్రుడి సంచారంతో అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం పొందుతారు.