భారతదేశంలో చూడాల్సిన అత్యంత ప్రత్యేకమైన 8 జలపాతాలు ఇవే!
samatha
27 February 2025
Credit: Instagram
భారతదేశం అందమైన జలపాతాలకు నిలయం. ప్రతి ఒక్కటి దాని ప్రత్యేకతో ఆకర్షణీయంగా నిలుస్తుంటాయి. కాగా ఇండియాలోని బెస్ట్ జలపాతాలు ఏవో మనం తెలుసుకుందాం.
అంజేరి రివర్స్ జలపాతం. ఇది మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో ఉంటుంది. ఇక్కడి గాలి ప్రవాహాలు. నీరు కొడల నుంచి కిందకు పడుతుంటే వాటిని పైకి వెళ్లేలా చేస్తుంటాయి. వర్షకాలంలో దీనిని మనం క్లారిటీగా చూడవచ్చును.
దూద్ సాగర్ జలపాతం. నాలుగు అంతస్తుల ఈ జలపాతం కొడలపై నుంచి తెల్లటి పాలదారా వస్తుందా అనే విధంగా కనిపిస్తుంది. చూడటానికి చాలా బాగుంటుంది.
భారతదేశంలో ఎత్తైన జలపాతాల్లో జోగ్ జలపాతం ఒకటి. ఇక్కడి ఎత్తైన కొండల నుంచి నీరు కిందకు పడుతూ ఉంటుంది. ఇది పర్యాటకులను ఆకర్షిస్తుంది.
ఇంద్రవతి నదిపై ఉన్న చిత్రకోట్ జలపాతం చూడటానికి చాలా బాగుంటుంది. దీనిని భారత దేశ నయాగరా అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలోనే అత్యంత విశాలమైన జలపాతం.
తిరత్ ఘర్ జలపాతం చత్తీస్ గఢ్‌లో ఉంది. ఇది చూడటానికి అంతస్తులలా ఉన్న కొడలపై నుంచి నీరు ప్రహించేలా కనిపిస్తుంది. అందమైన జలపాతాల్లో ఇదొక్కటి.
భారతదేశంలోనే అత్యంత ఎత్తైన జలపాతాల్లో కుంచికల్ జలపాతం ఒకటి. ఇది కర్ణాటకలో ఉంది. దాదాపు 455 మీటర్ల ఎత్తు నుంచి ఇక్కడ నీరు కిందపడుతుంది.
భారతదేశంలోనే అతి ఎత్తైన జలపాతాల్లో నోహ్కలికై జలపాతం ఒకటి. ఇది మేఘాలయలో ఉంది. 340 మీటర్ల ఎత్తు నుంచి పచ్చని చెట్ల మధ్య నీరు కిందకు పడుతుంది.