సమ్మర్‌లో కొబ్బరి మలై తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
samatha
27 February 2025
Credit: Instagram
సమ్మర్‌లో హైడ్రేట్‌గా ఉండటానికి చాలా మంది కొబ్బరి నీళ్లు తాగుతుంటారు. అయితే కొబ్బరి నీరే కాకుండా, కొబ్బరి మలై తినడం వలన కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట.
కొబ్బరి మలై చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మీ శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
కొబ్బరి మలైలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువలన మీ జీర్ణక్రియ సాఫీగా సాగడానికి ఇది దోహదపడుతుంది. జీర్ణక్రియ సమస్యల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది.
కొబ్బరి మలైలో లారిక్ ఆమ్లం ఎక్కువ ఉంటుంది. అలాగే యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలను కూడా ఇది అధికంగా కలిగి ఉండటం వలన ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్రపోషిస్తుంది.
కొబ్బరి మలైలో లభించే MCTలు (మీడియం-చైన్ ట్రైగ్లిజరైడ్స్) గ్లూకోజ్‌కు ప్రత్యామ్నాయ ఇంధన వనరును అందిస్తాయి, ఇది జ్ఞాపకశక్తి లేదా మెదడు పనితీరును బలహీనపరిచే వ్యక్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది.
గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో కొబ్బరి మలై కీలకంగా పని చేస్తుంది. ఇందులోని MCT లు గుండె జబ్బులకు ప్రమాద కారకాలైన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
అంతే కాకుండా రక్తంలోని చక్కర స్థాయిలను కొబ్బరి మలై నియంత్రిస్తుంది. 100 గ్రాముల కొబ్బరి మలైను ప్రతి రోజూ తీసుకోవడం వలన రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు తగ్గి టైప్2 డయాబెటిస్‌ను నివారించవచ్చు.
గర్భిణీలకు కొబ్బరి మలై పోషకాల గని అని చెప్పవచ్చు. దీనిని తిడం వలన పిండం మెదడు, నాడీ వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది.