పూల డ్రెస్‌లోని ఈ చిన్నది.. ఏకంగా పవర్ స్టార్ సరసనే ఛాన్స్ కొట్టేసిన గ్లామర్ బ్యూటీ అని తెలుసా?
samatha
28 February 2025
Credit: Instagram
పూల డ్రెస్‌లో చూడటానికి చక్కగా ఉన్న ఈ చిన్నారి ఎవరా అని ఆలోచిస్తున్నారా? తన గ్లామర్‌తో టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న బ్యూటీ ఈ క్యూట్ గర్ల్?
సవ్యసాచితో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచమై,ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తన అంద చందాలతో కుర్రకారు మదిని దోచేసింది ఈ అమ్మడు.
ఎవరో అర్థమైందా.. అందాల ముద్దుగుమ్మ నిధి అగర్వాల్. ఈ బ్యూటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇస్మార్ట్ శంకర్‌తో మంచి ఫేమ్ సంపాదించుకుంది.
ఇక తెలుగులో చాలా సినిమాల్లో నటించి, తన గ్లామర్‌తో మంచి క్రేజ్ సంపాదించుకున్నప్పటికీ, ఈ అమ్మడుకు ఆశించిన స్థాయిలో అవకాశాలు లేవనే చెప్పాలి.
దీంతో బాలీవుడ్, కోలీవుడ్ పై కన్నేసిన ఈ ముద్దుగుమ్మ అక్కడ అవకాశాలు దక్కించుకుంటూ పలు సినిమాలతో బిజీగా ఉంది.
అంతే కాకుండా ఈ బ్యూటీ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఈ మూవీ త్వరలో విడుదల కానున్నట్లు సమాచారం.
ఈ క్రమంలోనే నిధి అగర్వాల్ చిన్ననాటి ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోస్‌లో నిధి అగర్వాల్ తన క్యూట్ నెస్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది.
ఇక ఈ అమ్మడు ప్రస్తుతం ఈ సినిమాపైనే బోలేడు ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే? ఈ మూవీ గనుక హిట్ అయితే ఇక ఈ ముద్దుగుమ్మకు తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది.
మరి హరి హర వీరమల్లు మూవీతో నిధి అగర్వాల్ బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంటుందో లేదో చూడాలి అంటున్నారు తన ఫ్యాన్స్.