చాణక్య నీతి : జీవితంలో గొప్పగా బతకాలా.. తెలుసుకోవాల్సినవి ఇవే!
samatha
2 march 2025
Credit: Instagram
ఆచార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన భారత దేశంలోని గొప్ప పండితులలో ఒకరు. తత్త్వ వేత్త, రాజకీయకీయంపై మంచి పట్టు ఉన్న వ్యక్తి
చాణక్యుడు నీతి శాస్త్రం అనే పుస్తకాన్ని రచించి, దాని ద్వారా మానవులకు ఉపయోగపడే అనేక విషయాలను తెలియబరిచారు.
చాణక్యుడి సూత్రాలు , భోధనలు ఇప్పటి వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి. ముఖ్యంగా మానవుల సద్గుణాలు, దుర్గుణాల గురించి వివరంగా తెలియజేశారు.
ఇక ఆచార్య చాణక్యు ఒక వ్యక్తి తన జీవితంలో సక్సెస్ కావాలి అంటే ఏం చేయాలి అనేదాని గురించి కూడా తన నీతిశాస్త్రం ద్వారా తెలిపారు.
ఒక వ్యక్తి జీవన శైలి, తనలోని లోపాలే, అతని జీవితాన్ని నిర్ణయిస్తాయని ఆయన పేర్కొన్నారు. కాగా, జీవితంలో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలో చూద్దాం.
సోమరితనం ఉన్నవారు జీవితంలో ఏమీ సాధించలేరని , దీని వలన చాలా కోల్పోవాల్సి వస్తుంది. సోమరితనం వదిలేసి, విజయం కోసం నిరంతరం కృ షిచేస్తేనే విజయం వరిస్తుందంట.
నీ మనసు నీ ఆధీనంలో లేకపోతే నీవు విజయం సాధించడం చాలా కష్టం అంటున్నాడు ఆచార్య చాణక్యుడు. అందువలన మీ మనసును మీరెప్పుడూ మీ ఆధీనంలో ఉంచుకోవాలంట.
జ్ఞానం అనేది చాలా ముఖ్యమైనది. జ్ఞానం లేని వారు, అనుభవం ద్వారా నైనా లేదా పుస్తకం ద్వారా నైనా పొందిన జ్ఞానం ఎప్పటికీ వృధా కాదు ఇది లేకపోతే విజయం సాధించడం కష్టమంట.