విశ్వక్ సేన్ రీసెంట్‌గా లైలా మూవీతో అభిమానుల ముదుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీలో ఈ హీరో లేడీ గెటప్‌లో నటించి అలరించారు.
రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో విశ్వక్ సేన్, హీరోగా, ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటించి మెప్పించారు.
లవర్స్ డే కానుకగా, ఫిబ్రవరి 14న ఈ సినిమా థియేటర్లలో రిలీజై పాటిజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా విశ్వక్ లేడీ గెటప్‌లో అదరగొట్టాడంటూ, తన నటనకు మంచి ప్రశంసలు అందాయి.
దీంతో చాలా మంది ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు.ఎప్పుడెప్పుడు లైలా మూవీ ఒటీటీలోకి వస్తుందా అని వేయిట్ చేసేవారికి గుడ్ న్యూస్ అందింది.
విశ్వక్ సేన్ లైలా మూవీ థియేటర్లలో రిలీజై నెల రోజులు కూడా కాకముదే ఓటీటీలో సందడి చేయడానికి రెడీ అయిపోయింది.
తాజాగా లైలా మూవీ ఓటీటీ రిలీజైపై అప్డేట్ వచ్చింది. ఈ మూవీ డిజటల్ రైట్స్ ఆహా సొంతం చేసుకుంది. దీంతో ఈ మూవీ అతి త్వరలో ఆహాలో స్ట్రీమింగ్ కానున్నది.
లైలా మూవీ మార్చి7(శుక్రవారం) రోజున ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు మార్చి 5(బుధవారం) ఆహా అధికారికంగా ప్రకటించింది. దీంతో విశ్వక్ సేన్ ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు.
ఇక ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరికొత్తగా కనిపిస్తాడు. లేడీ గెటప్‌లో తన నటనతో అదరగొట్టాడనే చెప్పాలి. కామెడీ టైమింగ్, డైలాగ్స్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు