మార్కెట్‌కు వెళ్తున్నారా.. తాజా కూరగాయలను ఇలా గుర్తించండి!

samatha 

4 march 2025

Credit: Instagram

మనం రోజూ చేసే పనులలో మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు కొనడం ఒకటి . కొదరు వారానికి ఒకసారి కూరగాయలు కొనుగోలు చేస్తే, మరికొందరూ ప్రతి రోజూ వెళ్లి ఏ రోజుకు ఆరోజు ఫ్రెష్ కూరగాయలు కొనుగోలు చేస్తారు.

అయితే మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు కొనడం అనేది అంత సులభమైన పని ఏం కాదు. ఎందుకంటే? తాజాగా, మంచిగా ఉండే కూరగాయలను ఎంచుకోవడానికి కొంచెం అవగాహన ఉండాలి

కొన్ని సార్లు చూడటానికి ఫెష్‌గా కనిపించినా కూడా, అవి ఇంటికి తీసుకొచ్చి మరసటి రోజునే పాడైపోతాయి.కాగా, తాజా కూరగాయలను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.

బంగాళాదుంపలు కొనేటప్పుడు, ఎల్లప్పుడూ గుండ్రంగా , మెరిసే బంగాళాదుంపలు తాజావి. ఆకుపచ్చ లేదా నల్ల మచ్చలు ఉన్న బంగాళాదుంపలను అస్సలే కొనుగోలు చేయకూడదంట.

క్యాప్సికమ్ కొనేటప్పుడు,  దానికి నాలుగు లోబ్స్ ఉండేలా చూసుకోవాలంట. మూడు కోణాల క్యాప్సికమ్ తరచుగా చేదుగా ఉంటుంది.అలాగే టమాటోలు ఎప్పుడూ ఎరుపు రంగులో ఉన్నవే తీసుకోవాలి. రంగు మారితే ఫ్రెష్‌గా లేనట్లే.

బీన్స్, ఫరాసి, క్లస్టర్ బీన్స్ వంటి ఆకుపచ్చ కూరగాయలు తాజాగా ఉన్నాయో లేదో గుర్తించడానికి, ఒక పాడ్‌ను తేలికగా పగలగొట్టాలి. అది తేలికగా విరిగిపోతే తాజాది అని లేకపోతే పాడైపోయినట్లు.

పొట్లకాయ,సోరకాయ తాజాగా ఉందో లేదో తెలుసుకోవడానికి, దానిపై గోరును తేలికగా నొక్కడానికి ప్రయత్నించండి. గోరు సులభంగా చొచ్చుకుపోయి పచ్చరంగులో ఉంటే తాజావి అని అర్థం.

లేడీఫింగర్ కొంటున్నప్పుడు, అది చిన్నగా,మృదువుగా ఉండేలా చూసుకోవాలంట. అంతే కాకుండా పచ్చరంగులో ఉండేవి చూడాలి. ఇవి తాజాగా కూరగాయలు అని అర్థం.