అందాల ముద్దుగుమ్మ స్టార్ సీనియర్ హీరో కుమార్తె శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అనగనగా ఓ ధీరుడు సినిమాతో చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ.
అనతికాలంలోనే స్టార్ స్టేటస్ అందుకుంది. ఈ మూవీ తర్వాత శృతిహాసన్ చేసిన ప్రతీ సినిమా హిట్ అందుకుంది.ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన గబ్బర్ సింగ్ సినిమాలో నటించి ఈ బ్యూటీ మంచి ఫేమ్ సంపాదించుకుంది.
ఈ సినిమా తర్వాత ఈ అమ్మడుకు అనేక అవకాశాలు వచ్చాయి.వచ్చిన ప్రతి ఆఫర్‌ను అందిపుచ్చుకొని, స్టార్ హీరోయిన్‌గా టాలీవుడ్‌నే షేక్ చేసింది ఈ బ్యూటీ.
ఇక రీసెంట్‌గా ప్రభాస్ సలార్ మూవీలో నటించి పాన్ ఇండియా స్టార్ అయిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు నాలుగు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఈ బ్యూటీ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వరస ఫొటో షూట్స్‌తో తన అభిమానుల మనసు దోచేస్తుంటుంది.
తాజాగా ఈ చిన్నది రెడ్ కలర్ డ్రెస్‌లో తన అందాలతో కుర్రకారుకు విందు భోజనం పెట్టింది. ఎప్పుడూ, ఎక్కువగా బ్లాక్ డ్రెస్‌లో కనిపించే ఈ బ్యూటీ.
తాజాగా రెడ్ కలర్ డ్రెస్‌లో పలు ఫొటోలకు ఫోజులిచ్చింది. అందులో శృతిహాసన్ చాలా అందంగా కనిపించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఇక నటనతోనే కాకుండా శృతిహాసన్ సింగర్‌గా కూడా తన సత్తాచాటుతోంది. చాలా సినిమాల్లో ఈ బ్యూటీ పాటలు పాడి, తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.