అరటిపండ్లు ఇష్టపని వారు ఎవరుంటారు. ఆరోగ్యానికి, అలాగే రుచి కూడా బాగుండటం వలన చాలా మంది ఎంతో ఇష్టంగా దీనిని తింటుంటారు.
అంతే కాకుండా ప్రతి ఒకరి ఇంళ్లల్లో తప్పకుండా ఈ అరటిపండ్లు అనేవి ఉంటాయి. అయితే వీటిని మనం ఎక్కువ రోజులు తాజాగా ఉంచలేం.
ఎందుకంటే అరటి పండ్లను కొనుగోలు చేసి ఇంటికి తీసుకొచ్చుకున్న రెండు లేదా మూడు రోజుల్లోనే అవి నల్లగా మారిపోయి, పాడైపోతుంటాయి.
కాగా, అసలు అరటిపండ్లను ఎలా నిల్వ చేయాలి. ఇవి ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలి అనే విషయాలు తెలుసుకుందాం.
అరటిపండ్లను ఒకే చోట గాలి తగలని ప్రదేశంలో పెట్టకుండా, విడివిడిగా, వేలాడ దీయాలి. ఎందుకంటే ఇవి ఇథిలీన్ వాయవు ఉత్పత్తి చేస్తాయి. దీంతో ఒకదానికి ఒకటి దగ్గరగా ఉండటం వలన అన్నీ పాడైపోయే ఛాన్స్ ఉంటుంది.
అరటిపండ్లను తాజాగా ఉంచాలంటే, వాటిని తెల్ల కాగితం లేదా క్లాత్‌లో చుట్టి పెట్టాలి. దీని వలన పండ్లు తాజాగా ఉంటాయి. అవి వాటి సహజత్వాన్ని కోల్పోవు.
అలాగే అరటి పండ్లు ఇప్పుడే కొనుగోలు చేసినవాటిలా నిగ నిగా ఉండాలంటే వాటిని చల్లటి ప్రదేశంలో నిల్వ చేయాలి. దీని వలన అవి తాజాగా ఉంటాయి.
అరటి పండ్లు పూర్తిగా పండాయని మీకు తెలిసినప్పుడు. అవి త్వరగా పాడవకుండా ఉండాలంటే వాటి ఫ్రిజ్‌లో పెట్టడం మంచిది. దీని వలన అవి త్వరగా పాడైపోవు.