కాకి తెలిపే చెడు శకునాలు ఇవే.. ఇంటి ముందుకు వచ్చిందో..

కాకి తెలిపే చెడు శకునాలు ఇవే.. ఇంటి ముందుకు వచ్చిందో..

image

samatha 

13 march 2025

Credit: Instagram

చాలా మంది కాకి ఇంటి వద్దకు వచ్చిందంటే చాలు పూర్వీకులే కాకి రూపంలో వచ్చారంటూ ఆహారం పెడుతుంటారు. అంతే కాకుండా ఇది కొన్ని మంచి శకునాలు, చెడు శకునాలు ఇస్తుంటుంది.

చాలా మంది కాకి ఇంటి వద్దకు వచ్చిందంటే చాలు పూర్వీకులే కాకి రూపంలో వచ్చారంటూ ఆహారం పెడుతుంటారు. అంతే కాకుండా ఇది కొన్ని మంచి శకునాలు, చెడు శకునాలు ఇస్తుంటుంది.

ఇక జ్యోతిష్య శాస్త్రంలో కూడా దీని గురించి అనేక విషయాలను తెలియజేయడం జరిగింది. కాగా, అసలు కాకి తెలిపే మంచి, చెడు శకునాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇక జ్యోతిష్య శాస్త్రంలో కూడా దీని గురించి అనేక విషయాలను తెలియజేయడం జరిగింది. కాగా, అసలు కాకి తెలిపే మంచి, చెడు శకునాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

కాకులు కొన్ని విషయాలను మందే చేరవేస్తాయని చెబుతుంటారు మన పెద్దవారు. ఒక్కోసారి కాకి ఇంటి వద్దకు వచ్చి అరిచినప్పుడు, ఇంటికి బంధువులు వస్తుంటారు. అయితే ఇలానే కాకులు చాలా సంకేతాలు ఇస్తుంటాయంట. అవి :

కాకులు కొన్ని విషయాలను మందే చేరవేస్తాయని చెబుతుంటారు మన పెద్దవారు. ఒక్కోసారి కాకి ఇంటి వద్దకు వచ్చి అరిచినప్పుడు, ఇంటికి బంధువులు వస్తుంటారు. అయితే ఇలానే కాకులు చాలా సంకేతాలు ఇస్తుంటాయంట. అవి :

కాకి మీ ఇంటి వద్దకు వచ్చి పండ్లను లేదా పువ్వులను వదిలి వేసి వెళ్లిపోతే, ఆ ఇంట్లో మగ సంతానం పుడుతుందని అర్థం అంట.

కాకి ఒక వేళ తాను గూడు కట్టుకున్న గడ్డి పరకను గనుక మీ ఇంటి వద్దకు తీసుకొస్తే, ఆ ఇంట్లో ఆడపిల్ల పుడుతుందని అర్థం అంటున్నారు పండితులు.

అలాగే, పూలు లేదా బియ్యం లేదా నవధాన్యల్లో ఏవైనా ధాన్యాలను గనుక మీ ఇంటికి తీసుకొస్తే అవి చెడు ప్రభావాలను తీసుకొస్తాయంట. తీసుకొచ్చే ధాన్యాలను బట్టి వాటి ప్రభావం ఉంటుందంట.

అదే విధంగా మీ ఇంటి వద్ద ఒక కాకి, మరొక కాకితో ఆహారం పంచుకోవడం చేసినా, మీరు అలాంటిది చూసినా ఇది చాలా మంచిది అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు.

సూర్యుడిని చూసి కాకి అరిచినా, లేదా ఎర్రటి వస్తువులు లేదా పువ్వులు ఇంట్లోకి తెచ్చినా, అగ్ని దురదృష్టాన్ని తెస్తుంది.మీ ఇంట్లోని ఎవరివైనా బూట్లు లేదా వాహనంపైకి కాకి వచ్చిదంటే, లేదా వ్యక్తి శరీరాన్ని కాకి తాకినా ఆ వ్యక్తి చాలా జాగ్రత్తగా ఉండాలంట. 

మీరు ఎక్కడికైనా ప్రయాణం చేయాలనుకున్నప్పుడు కాకి మీ వెంట రావడం లేదా, మీ వద్ద ఎగరడం చేసినట్లైతే ప్రయాణం వాయిదా వేసుకోవాలంట. లేకపోతే పెద్ద సమస్య తలెత్తే ఛాన్స్ ఉన్నదంటున్నారు పండితులు.