గులాబీలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి.మనం రోజూ చూసే పూలలో ఇవి ఒకటి. అంతే కాకుండా ఈ పూలను చాలా మంది ఎంతగానో ఇష్టపడుతుంటారు.
ముఖ్యంగా గులాబీ పూలను చూస్తే చాలు వీటిని ప్రేమకు చిహ్నం అని అనుకుంటారు చాలా మంది. ఇక అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడే పూలలో గులాబీలే ముందుంటాయి.
అయితే మనం ఎప్పుడూ చూసే ఈ పూలు చాలా వరకు అందానికి మాత్రమే ఉపయోగపడుతాయని చాలా మంది అనుకుంటారు. కానీ వీటితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట.
గులాబీ రేకులను తినడం చాలా మందికి ఇష్టం ఉంటుంది. అయితే వీటిని తినడం ఆరోగ్యానికి చాలా మంచిది అంటున్నారు వైద్య నిపుణులు . ఎందుకంటే?
గులాబీలలో పాలీఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్స్‌తో పాటు, విటమిన్ సి, విటమిన్ ఎ, సోడియం, కాల్షియం ఐరన్ , ఫైబర్, కార్బో హైడ్రేట్స్, కెలరీలు అధికంగా ఉంటాయంట.
అందువలన గులాబీ రేకులను తినడం వలన జీర్ణక్రియ మెరుగు పడుతుందంట. అంతే కాకుండా ఎవరైతే మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారో వారు ఆ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
రోజ్ టీ కూడా తయారు చేసుకొని తాగొచ్చు. ఇలా గులాబీ రేకుల టీ తాగడం వలన శరీరానికి తక్షణ శక్తి లభించడమే కాకుండా రోజంతా చాలా యాక్టివ్‌గా ఉంటామంటున్నారు నిపుణులు.
అదే విధంగా, నిద్రలేమి సమస్యతో బాధపడే వారు గులాబీ రేకులను తమ బెడ్ పై వెదజల్లుకొని పడుకోవడం వలన హాయిగా నిద్ర పడుతుందంట.