థైరాయిడ్ ఉన్న వారు తప్పకుండా తీసుకోవాల్సిన ఫుడ్ ఇదే!
samatha
23 march 2025
Credit: Instagram
ప్రస్తుతం థైరాయిడ్ సమస్య అనేది చాలా కామన్ అయిపోయింది. తీసుకున్న ఆహారం, జీవన శైలి కారణంగా ఎంతో మంది మహిళలు ఈ సమస్య బారినపడుతున్నారు.
అయితే ఈ థైరాయిడ్ సమస్యలతో బాధపడే వారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు నిపుణులు. మంచి ఫుడ్ తీసుకోవడం వలన దీనిని కంట్రోల్ చేసుకోవచ్చునంట.
కాగా, అసలు థైరాయిడ్ ఉన్నవారు ప్రతి రోజూ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు తమ ఆహారంలో సెలీనియం చేర్చుకోవాలంట. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా థైరాయిడ్ సక్రమంగా పని చేసేలా చేస్తుంది.
థైరాయిడ్ నుంచి ఉపశమనం పొందాలంటే తప్పనిసరిగా ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కోసం చేపలను మీ డైట్‌లో చేర్చుకోవాలంట. దీని వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
విటమిన్ డి, కాల్షియం, అయోడిన్ వంటి పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వలన ఇవి థైరాయిడ్‌ను కంట్రోల్ చేయడానికి సహాయపడుతాయంట.
ఆకు కూరలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఆకుకూరల్లో మెగ్నీషియం, ఐరన్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి థైరాయిడ్ పనితీరు మెరుగు పపరుస్తాయి.
అందువలన వీటిని మీ డైట్‌లో చేర్చుకోవడం వలన థైరాయిడ్‌ను కంట్రోల్ చేయడమే కాకుండా, శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయంటున్నారు వైద్య నిపుణులు.