ఇళ్లలోకి పక్షులు, కీటకాలు రావడం అనేది సహజం. చాలా సార్లు ఇంటిలోపలికి పక్షులు వస్తూ పోతుంటాయి. కానీ కొన్ని రకాల పక్షులు ఇంట్లోకి వస్తే భయపడి పోతారు.
ముఖ్యంగా గుడ్లగూబ ఇంటిలోపలికి వచ్చిందంటే చాలు చాలా మంది ఏదో కీడు జరుగుతుందని భయపడిపోతుంటారు. ఎందుకంటే అది చూడటానికి కూడా చాలా భయంకరంగా ఉంటుంది.
మరి గుడ్లగూబ ఇంటిలోకి రావడం మంచిదికాదా? దీని గురించి పండితులు ఏం చెబుతున్నారో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
గుడ్ల గూబను చూస్తే చాలా మంది భయపడిపోతుంటారు. అంతే కాకుండా ఇది ఎదురు వస్తే అశుభంగా భావిస్తారు. దీనిని ఏ మాత్రం ఇంటిలోపలికి రానివ్వకూడదు అనుకుంటారు.
అంతే కాకుండా గుడ్ల గూబ ఇంటిలోపలికి వచ్చిందంటే చాలు అశుభంగా భావించి కొంత మంది ఆ ఇంటిని కొన్ని రోజుల వరకు వదిలి వేస్తారు.
కానీ గుడ్ల గూబ ఇంట్లోకి వస్తే చలా మంచిది అంటున్నారు పండితులు. ఎందుకంటే. గుడ్ల గూబ లక్ష్మీ దేవి వాహనం అన్న విషయం అందిరికీ తెలిసిందే.
అందువలన గుడ్లగూబ ఇంటిలోపలికి వస్తే, మన ఇంట్లోకి లక్ష్మీ దేవి రాబోతుందని అర్థం అంట. అంతే కాకుండా ఇది శుభ సూచకం అంటున్నారు పండితులు.
ముఖ్యంగా గుడ్ల గూబ దీపావళి రోజున ఇంటిలోపలికి వస్తే చాలా మంచిదంట. ఈ పండుగ రోజు గుడ్ల గూబ రాకను శుభపరిణామంగా భావిస్తారంట. లక్ష్మీ దేవినే ఇంటిలోకి వచ్చిందని నమ్ముతారంట.