పచ్చి బఠానీలతో క్యాన్సర్.. వీటిని నిషేధిస్తారా?

పచ్చి బఠానీలతో క్యాన్సర్.. వీటిని నిషేధిస్తారా?

image

samatha 

21 march 2025

Credit: Instagram

చాలా వంటల్లో పచ్చి బఠానీ ఉపయోగిస్తం. వీటి రుచి బాగుండటం వలన చాలా మంది  వీటిని తినడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు.

చాలా వంటల్లో పచ్చి బఠానీ ఉపయోగిస్తం. వీటి రుచి బాగుండటం వలన చాలా మంది  వీటిని తినడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు.

ముఖ్యంగా బగారా రైస్, బిర్యానీ, వెజిటేబుల్ రైస్ వంటి వాటిల్లో తప్పనిసరిగా బఠానీ ఉండాల్సిందే. ఇక వీటిని స్నాక్స్‌గా కూడా తీసుకుంటారు.

ముఖ్యంగా బగారా రైస్, బిర్యానీ, వెజిటేబుల్ రైస్ వంటి వాటిల్లో తప్పనిసరిగా బఠానీ ఉండాల్సిందే. ఇక వీటిని స్నాక్స్‌గా కూడా తీసుకుంటారు.

ఇక చాలా మంది పచ్చి బఠానీలు తినడం వలన  శరీరానికి అనేక పోషకాలు అందుతాయి, ఆరోగ్యానికి చాలా మంచిదని వారానికి కనీసం రెండు సార్లు అయినా తింటుంటారు.

ఇక చాలా మంది పచ్చి బఠానీలు తినడం వలన  శరీరానికి అనేక పోషకాలు అందుతాయి, ఆరోగ్యానికి చాలా మంచిదని వారానికి కనీసం రెండు సార్లు అయినా తింటుంటారు.

కానీ తాజాగా వీటికి సంబంధించి షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. పచ్చి బఠానీల్లో సింథటిక్ రసాయనాలు కలిసినట్లు అధికారులు తెలుపుతున్నారు.

కొన్ని రోజుల క్రితం బెంగళూరులోని అనేక హోటల్స్, దుకాణాల్లో ఉన్న పచ్చి బఠానీలను అధికారులు సేకరించి ప్రయోగశాలలో టెస్ట్ చేయగా, వీటిలో సింథటిక్ రసాయనాలు ఉన్నట్లు తేలిందంట.

పచ్చి బఠానీల్లో బ్రిలియంట్ బ్లూ, టెట్రాజిన్ వంటి రసాయనాలు కలుపుతున్నారంట. వీటిని తీసుకోవడం వలన ఆరోగ్యానికి తీవ్రనష్టం వాటిల్లే అవకాశం ఉంది అంటున్నారు అధికారులు.

ఈ రసాయనాలు ఉన్న పచ్చి బఠానీలను తీసుకోవడం వలన ఎముకలు బలహీనపడటం, రోగనిరోధక శక్తి తగ్గడం, క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నదంట.

అందువలన రసాయనాలు కలిగిన పచ్చి బఠానీలను తప్పని సరిగా నిషేధించాలని ప్రజలు, అధికారులు క్రేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు .