ప్రస్తుతం క్యాన్సర్ చాపకింద నీరుల వ్యాపిస్తుంది. చాలా మంది దీని బారిన పడి ప్రాణాలు విడుస్తున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు చాలా మంది క్యాన్సర్‌తో పోరాడుతున్నారు.
అయితే క్యాన్సర్ బారిన పడకూడదన్నా, క్యాన్సర్ నివారకు కొన్ని రకాల ఆహారపదార్థాలు తీసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.
యాపిల్ క్యాన్సర్‌తో పోరాడుతుంది. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్లు, పాలీ ఫెనాల్స్ క్యాన్సర్‌తో పోరాడటానికి సహాయపడుతాయి. అందుకే ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ ఒక పండు తినాలంట.
అవకాడో ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్లు, ఫైబర్,పొటాషియం , ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందువలన క్యాన్సర్ నివారణకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
క్యాన్సర్ నుంచి మిమ్మల్ని కాపాడటంలో టమాటోలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, క్యాన్సర్ వలన కలిగే నష్టాన్ని నివారించడానికి తోడ్పడుతాయి.
క్యాన్సర్ నుంచి మిమ్మల్ని కాపాడటంలో టమాటోలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, క్యాన్సర్ వలన కలిగే నష్టాన్ని నివారించడానికి తోడ్పడుతాయి.
పసుపులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా ఇది పెద్ద పేగు క్యాన్సర్ నుంచి మిమ్మల్ని రక్షించడానికి చాలా తోడ్పడుతుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
నారింజ, నిమ్మకాయలు వంటి సిట్రస్ పండ్లతో తయారు చేసిన జ్యూస్ తాగడం వలన ఇవి క్యాన్సర్‌ను నివారించడంలో తోడ్పడుతాయంట. ఎందుకంటే ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది.
బ్రోకలీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ కూరగాయలో ఇండోల్ 3 కార్బినాల్ పుష్కలంగా ఉంటుంది. ఇది తినడం వలన రొమ్ము క్యాన్సర్ కు చెక్ పెట్టవచ్చు. ఇందులో ఉండే పోషకాలు రొమ్ము క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి.