కల్పనా చావ్లా జయంతి.. ఈ వ్యోమగామి గురించి ఈ వాస్తవాలు తెలుసా?
samatha
17 march 2025
Credit: Instagram
భారతదేశంలో జన్మించిన అమెరికన్ వ్యోమగామి కల్పనా చావ్లా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంతో మంది మహిళలకు ఈమె రోల్ మోడల్.
కల్పనా చావ్లా 1962 మార్చి 17న జన్మించింది. ఈమె అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి భారతీయ మహిళగా రికార్డ్ క్రియేట్ చేసింది.
2003 కొలంబియా విపత్తులో ప్రాణాలు కోల్పోయింది. కానీ ఇప్పటికీ ఎంతో మంది మహిళలకు కల్పనా చావ్లా ఆదర్శంగా నిలుస్తుంది.
కల్పనా చావ్లా జయంతి సందర్భంగా ఆమెకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. కల్పనా చావ్లా పంజాబ్‌లో ఎరోనాటికల్ ఇంజనీరింగ్ చదివిన మొదటి మహిళ.
కల్పనా చావ్లాకు చిన్నతనం నుంచి విమాన ప్రయాణం అంటే ఆసక్తి ఎక్కువ. దీంతో చదువు పూర్తి చేసి ఆమె నాసాలోని అమెస్ రీసెర్చ్ సెంటర్‌లో చేరింది.
అక్కడ పిహెచ్‌డి పూర్తి చేసిన తర్వాత 1988లో యూఎస్ అంతరిక్ష సంస్థలో పని ప్రారంభించింది.రెండు సంవత్సరాల తర్వాత 1994లో వ్యోమగామి అభ్యర్థిగా ఎంపికైంది.
1997లో, ఆమెకు స్పేస్ షటిల్ కొలంబియాలో అంతరిక్షంలోకి ప్రయాణించే తొలి అవకాశం లభించింది, తర్వాత రెండవ అవకాశం 2003లో STS-107లో జరిగింది ఇదే కల్పనా చివరి ప్రయాణం.
16 రోజుల విమాన ప్రయాణం దురదృష్టకర ముగింపును చూసింది, తిరిగి వస్తున్నప్పుడు అంతరిక్ష నౌక విచ్ఛిన్నమైంది. కల్పనా చావ్లాతో సహా అందులో ఉన్న ఏడుగురు మరణించారు.
కల్పనా చావ్లా కోరిక మేరకు, ఆమె అవశేషాలను ఉతాలోని నేషనల్ పార్క్‌లో దహనం చేసి చెల్లాచెదురుగా ఉంచారు.