సమ్మర్ వచ్చేసింది. మార్చినెల మొదలు కాగానే ఎండలు దంచికొడుతున్నాయి. అంతే కాకుండా పలు చోట్ల వేడిగాలు కూడా వీస్తున్నాయి.
ఇక ఈ సమ్మర్‌లో బయటకు వెళ్లాలంటే చాలు చాలా మంది భయపడి పోతుంటారు. ఎందుకంటే ఎండ వేడికి డీహైడ్రేషన్ బారినపడటం జరుగుతుంది.
అందుకే వేసవిలో ఆరోగ్యం కోసం తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా వాటర్ కం టెంట్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలని చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు.
అయితే ఇక వేసవి మొదలైందంటే చాలు చాలా మంది ముఖ్యంగా నిమ్మరసం తాగడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఇందులో మంచి పోషకాలు అధికంగా ఉంటాయి.
రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా తక్షణ శక్తిని అందిస్తాయి. అయితే కొందరు మంచిదని ప్రతి రోజూ నిమ్మరసం తాగుతుంటారు. మరి ఇలా తాగడం మంచిదేనా?
నిమ్మరసం ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా ఇందులో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. దీని వలన అంటు వ్యాధుల బారిపడకుండా ఉండటానికి ఇది బాగా పనిచేస్తుంది.
అంతే కాకుండా ఇదు శరీరంలోని వ్యర్థాలను బయటకు తొలిగించడానికి సహాయపడుతుంది. శరీరాన్ని హైడ్రేట్ చేసి, రోగనిరోధక శక్తి పెంచుతుంది.
కానీ ఆరోగ్యానికి మంచిదని దీనిని అధికంగా తీసుకోకూడదంట. మొతాదుకు మించి నిమ్మరసం తాగడం వలన వాంతులు, ఎసిడిటీ పెరగడం, అలర్జీ, పళ్లు సెన్సిటీవ్‌గా మారడం జరుగుతుందంటున్నారు వైద్యులు.