ఉగాది తర్వాత అదృష్టం కలిసి వచ్చే రాశులు ఇవే.. మీ రాశి ఉందా..

samatha 

16 march 2025

Credit: Instagram

జ్యోతిష్య శాస్త్రం‌లో గ్రహాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. గ్రహాలు, నక్షత్రాలు లేదా రాశులను మారుతుంటాయి. ఉగాది తర్వాత ఓ గ్రహం తన నక్షత్రాన్ని మారనుంది.

ఇలా గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచరించడం లేదా? నక్షత్రంలోకి మారడం వలన పన్నెండు రాశులపై దాని ప్రభావం పడుతుంది.

అయితే గురుడు చాలా రోజుల తర్వాత కుజుడి నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు అంటున్నారు పండితులు. దీని వలన మూడు రాశుల వారికి తిరుగే ఉండదంట.

 నవ గ్రహాల్లో గురు గ్రహానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. గురుడు తన నిర్దిష్ట సమయంలో నక్షత్ర రాశులు, రాశిచక్ర గుర్తులను మారుస్తాడు. ఈ మార్పు ప్రతి రాశిపై ప్రభావం చూపుతుంది. 

అయితే ఇప్పుడు గురుడి సంచారం వలన వృషభ రాశి, కర్కాటక రాశి, మకర రాశి వారికి అనుకోని లాభాలు వచ్చిపడే అవకాశం ఉంది అంట.

గురు సంచారం వలన వృషభ రాశి వారికి ధనల లాభం కలుగుతుంది. ఉద్యోగస్తులు ప్రమోషన్స్ పొందే అవకాశం ఉంది. ఆర్థికంగా కలిసి వస్తుంది.

కర్కాటక రాశి వారికి కూడా గురుడి సంచారం చాలా అదృష్టాన్ని తీసుకొస్తుంది. అనుకున్న పనులన్నీ సకాలంలో నెరవేరుతాయి. ఆర్థికంగా బాగుంటుంది. నిరుద్యోగులు ఉద్యోగం సంపాదిస్తారు.

మకర రాశి వారికి అనుకోకుండా డబ్బు చేతికి అందుతుంది. స్థిరాస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇంట్లో ఆనందకర వాతావరణం నెలకొంటుంది. ఆర్థికంగా బాగుంటుంది.

ముఖ్యంగా వ్యాపారస్తులకు అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే రియలెస్టేట్ రంగంలో ఉన్నవారికి కూడా గురు సంచారం అదృష్టాన్ని తీసుకొస్తుంది అంటున్నారు పండితులు.