మూత్రపిండాల ఆరోగ్యానికి బెస్ట్ ఫుడ్స్ ఇవే!

samatha 

17 march 2025

Credit: Instagram

మన శరీరంలో కిడ్నీలు చాలా ముఖ్యమైనవి. ఇవి మన శరీరంలోని వ్యర్థాలను వేరు చేసి యూరిన్ ద్వారా బయటకు పంపిస్తాయి.

అందువలన కిడ్నీల ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే కిడ్నీలు మన శరీరంలో కీలక పాత్ర పోషిస్తుంటాయి

ఒక వేళ కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే మన ప్రాణానికే ప్రమాదం. అందువలన కిడ్నీల ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

అయితే కిడ్నీల పనితీరు బాగుండాలి అంటే కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. కాగా అవి ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

కిడ్నీల పనితీరు మెరుగు పరచడంలో బెర్రీలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. అందువలన ప్రతి రోజూ తప్పకుండా బెర్రీలను తినాలంట.

అదే విధంగా వెల్లుల్లీ  ఆరోగ్యానికి చాలా మంచిది అనే విషయం అందరికీ తెలిసిందే. ప్రతి రోజూ మీ ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకోవడం వలన కిడ్నీ సమస్యలు దూరమవుతాయంట.

అలాగే క్యాప్సికమ్ కూడా కిడ్నీల పనితీరును మెరుగు పరుస్తాయి. అందువల కనీసం వారానికి రెండు సార్లు అయినా క్యాప్సికం తినాలంట. 

అదే విధంగా, ప్రతిరోజూ మార్నింగ్ ఒక యాపిల్ పండు తినడం వలన మీ కిడ్నీలు చురుకుగా పనిచేస్తాయి అంటున్నారు వైద్య నిపుణులు.