వేసవిలో వరసగా మూడు రోజులు ద్రాక్షపండ్లు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
samatha
17 march 2025
Credit: Instagram
గ్రేప్స్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ముఖ్యంగా సమ్మర్‌లో వీటిని తినడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు ద్రాక్ష ప్రియులు.
అయితే తాజాగా నెట్టింట్లో ద్రాక్ష పండ్లకు సంబంధించిన డైట్ ప్లాన్ తెగ వైరల్ అవుతోంది. మూడు రోజుల పాటు క్రమంగా ఈ పండ్లను తినడం వలన అనేక లాభాలు ఉన్నాయంట.
ఈ విషయాన్ని నిపుణులు కూడా తేల్చి చెబుతున్నారు. మూడు రోజుల ద్రాక్షపండ్లను తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వారు వెళ్లడించారు. అవి :
ఒక రోజు నుంచి మూడు రోజుల పాటు ఒకే రకం ఆహారం లేదా పండ్లను తినడాన్ని మోడైట్ అంటారు. దీని వలన జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుందంట. రోగ నిరోధక శక్తి పెరుగుతుందంట.
అలా మూడు రోజుల పాటు కేవలం ద్రాక్ష పండ్లనే తినడం వలన డీ హైడ్రేషన్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
దీని వలన హైడ్రేషన్ మెరుగు పడి శరీరానికి కావాల్సిన నీరు అందుతుందంట. లింఫాటిక్ వ్యవస్థ పని తీరు మెరుగుపడుతుందంట. కడుపులో ఉన్న వ్యర్థాలు తొలిగిపోతాయంట.
అలాగే ద్రాక్షలోని యాంటీఆక్సిడెంట్స్, విటమిన్స్, ఇతర సహజసిద్ధమైన చక్కెరలతో తక్షణ శక్తినిస్తాయంట. అయితే డయాబెటీస్ రోగులు మాత్రం ఈ డైట్‌కు దూరం ఉండటం మంచిదంట.
ఎందుకంటే?జీర్ణవ్యవస్థ మెరుగుపడినా కూడా శరీరానికి ఇతర పోషకాలు అందవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. డయాబెటిస్ రోగుల్లో చక్కెర వ్యాధులు ఎగుడుదిగుడు అయ్యి ఇబ్బందులు తలెత్తుతాయంట.