సమ్మర్ వచ్చేసింది. రోజు రోజుకు ఎండ తీవ్రత విపరీతంగా పెరుగుతుంది. ఈ క్రమంలో చాలా మంది నీరసం, అలసటకు గురి అవుతుంటారు.
అయితే ఈ సమ్మర్‌లో మీరు ఆరోగ్యంగా ఉండటానికి తప్పకుండా కొన్ని రకాల పండ్లు తీసుకోవాలంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం?
వేసవిలో ఎక్కువగా దొరికే పండ్లలో పుచ్చకాయ ఒకటి. దీనిని తినడం వలన ఇది మిమ్మల్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుందంట. రోగనిరోధక శక్తి పెంచుతుంది.
మామిడిలో యాంటీ ఆక్సిడెంట్లు అలాగే విటమిన్ ఏ, సీలు సమృద్ధిగా ఉంటాయి. దీనిని వేసవిలో తినడం వలన శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుందంట.
నీటి శాతం అధికంగా ఉండే పండ్లలో కర్బూజ పండు ఒకటి. దీనిని సమ్మర్‌లో తినడం వలన జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది.ఆరోగ్యంగా బాగుంటుంది.
స్ట్రాబెర్రీలలో ఫైబర్, విటమిన్స్, మాంగనీస్, ఫ్లేవనాయిడ్లు, పొటాషియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. దీనిని వేసవిలో తీసుకోవడం వలన శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది.
లిచీ పండు ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని వేసవి కాలంలో తప్పకుండా తీసుకోవాలంట. ఇది తినడం వలన ఎముకలు బలంగా ఉండటమే కాకుండా జీర్ణక్రియ సాఫీగా సాగిపోతుంది.
వేసవిలో హైడ్రేటెడ్‌గా ఉండటానికి మీ ఆహారంలో తప్పనిసరిగా పైనాపిల్ తీసుకోవాలంటున్నారు వైద్యులు. ఇది మీలో రోగనిరోధక శక్తిని పెంచడానికి దోహదపడుతుంది.