30 సంవత్సరాలు కలిసి ఉన్నా, విడాకులు తప్పవా..నిపుణులు ఏమంటున్నారంటే?
samatha
21 march 2025
Credit: Instagram
ప్రస్తుతం విడాకుల కల్చర్ విపరీతంగా పెరిగిపోతుంది. ముఖ్యంగా సెలబ్రిటీలు పెళ్లై సంవత్సరం కూడా కాకముందే విడాకులు తీసుకొని విడిపోతున్నారు.
ఇంకొందరు పెళ్లై కొన్ని సంవత్సరాలు కలిసి ఉండి, చిన్న చిన్న మనస్పర్ధల కారణంగా, కొన్నేళ్ల బంధాన్ని కూడా తెంపుకోవడానికి రెడీ అయిపోతున్నారు.
పెళ్లి అనేది వందసంవత్సరాల వరకు ముడివేసే ఓ బంధం. జీవితంలో భాగస్వామిని ఎంచుకునే సమయంలోనే చాలా విషయాలు దృష్టిలో ఉంచుకోవాలి అంటారు.
ఇక ఇటీవల విపరీతంగా ప్రేమవివాహాలు పెరిగిపోయి. పెళ్లికి ముందే ఒకరిని ఒకరు తెలుసుకొని వివాహం చేసుకుంటున్నారు, ఇంకొందరు పెద్దలు నిర్ణయించిన వివాహం చేసుకుంటున్నారు.
అయితే ఎలా వివాహం జరిగిగా, ఈ మధ్య కాలంలో మాత్రం చాలా మంది డివర్స్ తీసుకోవడం కామన్ అయిపోయింది. రోజు రోజుకు విడాకుల కేసులు పెరుగుతున్నాయి.
షాకింగ్ విషయం ఏమిటంటే, చాలా ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నవారు కూడా విడాకులు తీసుకొని విడిపోతున్నారు. అయితే దీనికి గల కారణాలు ఏవి? నిపుణులు ఏం చెబుతున్నారంటే?
మనీ బంధాలను దూరం చేస్తుందంటారు. అయితే డబ్బు విషయంలో చాలా మంది భార్య భర్తల మధ్య గొడవలు వస్తుంటాయి. దీని వలన కూడా దంపతులు విడిపోయే ఛాన్స్ ఉంటుందంట.
కొంత మంది పెళ్లి తర్వాత తమ బంధంలో నిజాయితీగా ఉండరు, అయితే పెళ్లి తర్వాత మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు, అబద్ధాలే భార్య భర్తలు విడిపోవడానికి కారణం అవుతుందంట.
దంపతుల్లో గొడవలు కామన్, వీటిని సకాలంలో పరిష్కరించుకోవాలి. లేకపోతే ఇద్దరి మధ్య చిన్న సమస్యలే పెద్దగా మారి, విడాకులకు దారితీస్తుందంట. ఈ కారణాల వల్లే ఎన్నో ఏళ్ల బంధమైనా క్షణంలో తెగిపోతుందంట.