ఏసీ ఎంత వాడినా కరెంట్ బిల్లు తక్కువ రావాలా.. ఈ సింపుల్ టిప్స్ మీకోసం!
samatha
22 march 2025
Credit: Instagram
వేసవి మొదలై పోయింది. మార్చి మొదటి వారం నుంచే భానుడు తన ప్రతాపం చూపెడుతున్నాడు. రోజు రోజుకు ఎండల తీవ్రత పెరిగిపోతుంది.
దీంతో చాలా మంది కాసేపు బయటకు వెళ్లడానికి భయపడి పోతున్నారు. ఇక ఇంట్లో ఉక్కపోతతో కూడా సతమతం అవుతున్నారు.
అయితే ఈ సమ్మర్‌లో ఉక్కపోత నుంచి బయటపడటానికి చాలా మంది ఏసీ లేదా కూలర్ వంటివి కొనుగోలు చేసి వాడుతుంటారు.
కానీ కొంత మంది వేసవిలో ఎక్కువ సేపు ఏసీ వాడటం వలన కరెంట్ బిల్లు అధికంగా వస్తుందని దానిని ఎక్కువగా ఉపయోగించకపోవడం లేదా కొనుగోలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపరు.
అయితే సమ్మర్‌లో ఎంత సేపు ఏసీ ఆన్ చేసి పెట్టినా కరెంట్ బిల్లు తక్కువరావాలనుకుంటే కొన్ని టిప్స్ పాటించాలంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.
ఏసీని కొనుగోలు చేసినప్పుడు దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ముఖ్యంగా తక్కువ స్టార్ రేటింగ్ ఉన్న వాటిని ఎంచుకోకూడదు. దీని వలన కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది.
అలాగే ఏసీ సెట్టింగ్‌లపై మంచి అవగాహన ఉండాలి. తప్పకుండా ఏసీని 24 పాయింట్ల వద్ద ఉపయోగించాలంట. దీని వలన కరెంట్ బిల్లు తక్కువగా వస్తుందంటున్నారు నిపుణులు.
5 స్టార్ రేటింగ్ ఉన్నవాటిని ఎంచుకోవడం వలన కరెంట్ బిల్లు ఆదా అవుతుంది. అలాగే తప్పనిసరిగా ఏసీని సర్విసింగ్ చేయిస్తూ ఉండాలంట. ఇలా చేయడం వలన కరెంట్ బిల్లు తగ్గుతుంది.