ఇప్ప పువ్వు లడ్డూ.. దీని ప్రయోజనాలు తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం!
samatha
1 april 2025
Credit: Instagram
ఇప్పపువ్వు తెలంగాణలో దొరికే అద్భుతమైన ప్రకృతి ప్రసాదం అని చెప్పాలి. దీని గురించి ఎక్కువగా ఏజెన్సీ, గిరిజనలుకు తెలుసు.
ఇప్పపువ్వుతో సారా చేస్తారని అందరికీ తెలుసు. కానీ దీనితో తయారు చేసిన లడ్డూ తింటే ఆ రుచికి మించినది వేరే ఏదీ లేదంటారంట.
అంతలా రుచి ఉండటమే కాకుండా, ఈ ఇప్పపువ్వు లడ్డూతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.
కాగా, గిరిజనులు, ఆదివాసీలు తయారు చేసే ఈ ఇప్పపువ్వు లడ్డు తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
ఇప్పపువ్వులో అనేక పోషకాలు ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులు, మోకాల నొప్పులు, కండరాల నొప్పుల తగ్గిస్తాయంట.
ఈ పువ్వులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ జీర్ణక్రియ సక్రమంగా సాగేలా చేస్తుంది. దీనిని తినడం వలన మలబద్ధకం, గ్యాస్, కడుపు సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
ఈ పువ్వులతో తయారు చేసిన లడ్డూ తినడం వలన రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా, ఇన్ఫెక్షన్స్ కూడా దరిచేరవని చెబుతున్నారు వైద్య నిపుణులు.
ఈ పువ్వులు తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఎలాంటి అలర్జీలు రానివ్వడమే కాకుండా, దురద, తామెర వంటి చర్మ సమస్యలు రాకుండా కాపాడుతుంది.