ఏసీ ఎంత వాడినా కరెంట్ బిల్లు సగానికి సగం.. బెస్ట్ టిప్స్ మీకోసమే!
samatha
1 april 2025
Credit: Instagram
వేసవి వచ్చిందంటే చాలు ఇంట్లో కూలర్లు, ఏసీలు ఎప్పుడూ ఆన్‌లోనే ఉంటాయి. ఎండ తీవ్రత, ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం రోజంతా ఏసీ ఆన్ చేసి పెట్టుకుంటుంటారు.
కొందరు ఏసీ వాడితే కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందని భయపడతారు, ఏసీ ఎంత సేపు వాడినా కరెంట్ బిల్లు సగానికి సగం రావాలంటే తప్పకుండా కొన్ని టిప్స్ పాటించాలంటున్నారు నిపుణులు.
అధిక ఏసీ బిల్లును ఎలా తగ్గించుకోవాలి? ఏసీని ఎలా వాడటం వలన కరెంట్ బిల్లును తగ్గించుకోవచ్చో, ఆ చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఉపయోగంలో లేని సమయంలో ఏసీని ఆపివేయడం చాలా ఉత్తమం. అయితే ఏసీని ఆఫ్ చేయడం అంటే రిమోట్ ఆఫ్ చేయడం కాదంట, మెయిన్ స్విచ్ ఆఫ్ చేయాలి.
ఏసీ ఉష్ణోగ్రతను తక్కు ఉండేలా సెట్ చేసుకోవడం వలన అది తక్కువ కరెంట్‌ను వినియోగించుకుంటుంది. దీని వలన కరెంట్ బిల్లు తగ్గించుకోవచ్చు.
ఏసీ ఉపయోగిస్తున్నప్పుడు గది తలుపులు ఎల్లప్పుడూ మూసి వేసి ఉంచాలి. దీని వలన రూమ్ ఎప్పుడూ చల్లగా ఉండటమే కాకుండా వేడిగాలి లోపలికి రాదు, దీంతో మంన ఉష్ణోగ్రత తక్కువకు సెట్ చేసుకోవచ్చు.
ఏసీ ఆన్ లో ఉన్నప్పుడు ఫ్యాన్ కూడా ఆన్ లో ఉండటం వలన ఇది గదిలోని అన్ని మూలలను త్వరగా చల్లబడేలా చేస్తుంది. దీని వలన కరెంట్ వినియోగం తగ్గే అవకాశం ఎక్కువ ఉంటుందంట.
ఏసీ ఉపయోగంలో లేనప్పుడు, దుమ్ము, ధూళి అందులో ఎక్కువగా చేరిపోతుంది. అందువలన ఏసీని క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించుకుంటూ ఉండాలి.