భారతదేశంలో ఉన్న తొమ్మిది టేస్టీ మామిడిపండ్లు ఇవే.. తప్పక రుచి చూడాల్సిందేనంట!
samatha
4 april 2025
Credit: Instagram
భారతదేశంలో 9 రకాల టేస్టీ మామిడిపండ్లు ఉన్నాయంట. వాటి టేస్ట్ సూర్ ఉంటదంట. కాగా, ఆ మామిడి పండ్లు ఎక్కడ లభిస్తాయో చూద్దాం.
కేరళలోని కన్నూర్ జిల్లాలో లభించే కుట్టియత్తూరు మామిడిపండ్లు చాలా రుచిగా ఉంటాయి. వీటి పూత నవంబర్ లో మొదలై, త్వరగా కాయలు కాస్తాయంట.
బనగానపల్లె మామిడిపండ్లు ఏపీలో ఎక్కువగా లభిస్తుంటాయి. వీటి టేస్ట్ చూస్తే వావ్ అనాల్సిందేనంట. ఇవఇ ఎక్కువ గుజ్జు, రసంతో చాలా తియ్యగా ఉంటాయి.
మలిహబాది దాసెహరి మామిడిపండ్లు చాలా మందికి ఇష్టం. వీటిని ఒకప్పుడు రాజులు వారి తోటలలో పండించుకునేవారు. ఈ పండ్ల రుచి చాలా బాగుంటుందంట. ఉత్తర ప్రదేశ్ లో లభిస్తాయి.
చిక్కగా, చర్మం పలచగా ఉండి లోపల గుజ్జు ఎక్కువగా ఉండే మామిడిపండ్లలో కరి ఇషాద్ ముందుంటంది. ఇది కర్ణాటకలో లభిస్తుంది. దీని టేస్ట్ చాలా బాగుంటుందంట.
బంగారు రంగులో ఉండే గిర్ కేసర్ మామిడి పండ్లు మంచి సువాసనను వెదజల్లుతాయి. అంతే కాకుండా వీటిని ఒక్కసారి తింటే ఆ రుచిని మర్చిపోలేమంట. ఇవి గుజరాత్ లో లభిస్తాయి
గోవాలో లభించే మామిడిపండ్లలో మన్ కురాడ్ ఒకటి. ఈ పండ్లు చాలా టేస్టీగా ఉంటాయంట. చూడటానికి ఎరుపు రంగులో కనిపించే ఈ పండ్లు తీపి, పుల్లటి రుచితో ఉంటాయి.
ఉత్తర్ ప్రదేశ్ లో లభించే పండ్లలో బనారసి లాంగ్డా పసుపు రంగులో చాలా పల్చటి తొక్కతో ఎక్కువ తీపిగా ఉంటాయి. వీటిని చాలా మంది ఎక్కువగా ఇష్టపడతారంట.
అదే విధంగా బీహార్ లోని భాగల్పురి మామిడిపండ్లు, బెంగాలీ ఖిర్సాపతి మామిడి పంట్లు కూడా చాలా రుచిగా ఉంటాయంట. వీటిని టేస్ట్ చేస్తే మళ్లీ మళ్లీ వాటిని తినాలనిపిస్తుందంట.