పితృదోషం ఉంటే ఇంట్లో కనిపించే సంకేతాలు ఇవే!

పితృదోషం ఉంటే ఇంట్లో కనిపించే సంకేతాలు ఇవే!

image

samatha 

2 april 2025

Credit: Instagram

ఇంట్లో మనకు తెలియకుండా కొన్ని చెడు సంఘటనలు గనుక జరుగుతున్నట్లు అయితే తప్పకుండా పితృదోషం ఉందని గమనించాలి అంటున్నారు పండితులు.

ఇంట్లో ఒత్తిడితో కూడిన పరిస్థితులు, ఏదైనా అనుకోని కారణాల వలన చెటు సంఘటనలు ఎదురు అవ్వడం, అంతే కాకుండా అసలు సమస్యలకు కారణం తెలియకపోవడం పితృదోషం కావచ్చునంట.

అదే విధంగా, అతిగా ఆలోచించడం, చిన్న విషయాల గురించి ఎక్కువ ఆలోచించే అలవాటు తగ్గించుకోలేకపోవడం, కూడా పితృదోషానికి సంకేతం

ఇంట్లో రావి చెట్టు పెరగడం అనేది మంచిది కాదు అని చెబుతుంటారు. కానీ మీ ఇంట్లో అకస్మాత్తుగా రావి చెట్టు పెరగడం కూడా, పితృదోషానికి సంకేతం అంట.

తులసి చెట్టు అనేది ఇంట్లో సుఖశాంతులను, శ్రేయస్సుకు చిహ్నం అంటారు. కానీ ఉన్నట్లుండి తులసి చెట్టు గనుక ఎండిపోయినట్లు అయితే, పితృదోశం ఉన్నట్లేనంట.

ఇంట్లో ఎటువంటి కారణాలు లేకుండా పదే పదే గొడవలు జరగడం, పదే పదే భార్య భర్తలు, పిల్లల మధ్య మనస్పర్థలు, గొడవలు వస్తే పితృదోషం ఉన్నట్లేనంట.

అలాగే, ఎప్పుడూ ఇంట్లో ఎవరిదో ఒకరి ఆరోగ్యం బాగాలేకపోవడం. ఎలాంటి కారణాలు లేకుండా అనారోగ్య సమస్యలు దరిచేరడం, ఎప్పుడూ ఎవరో ఒకరు అనారోగ్స సమ్యలతో బాధపడటం కూడా పితృదోషమే కారణం.

అదే విధంగా ఆర్థికపరమైన నష్టాలు, ఇబ్బందులు, ఇంట్లో చికాకులు, గొడవలు జరగడం ఇవన్నీ పిత‌ృదోషం వలన జరుగుతాయి అంటున్నారు పండితులు. అందుకే ఒకసారి మంచి జ్యోతిష్యుడిని సంప్రదించి, సలహా తీసుకోవాలంట.