పవన్ కల్యాణ్‌కు అందుకే అలా జరుగుతోంది వీడియో
కొందరు టాలీవుడ్ ప్రముఖుల గురించి ఇటీవల జ్యోతిష్యుడు వేణు స్వామి చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ పైనా నాగచైతన్య శోభితపైనా సంచలన కామెంట్స్ చేసి ఫాన్స్ ఆగ్రహాన్ని కళ్లజూశారు. ఇంత జరిగినా ఈ జ్యోతిష్యుడు ఆగడం లేదు. వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. సెలబ్రిటీల జాతకాలంటూ సంచలన కామెంట్స్ చేస్తున్నారు. పైగా జ్యోతిష్యశాస్త్రంలో ఉంది అందుకే తాను చెప్పింది తప్పకుండా జరుగుతుందంటున్నారు. తను ఊహించి చెప్పిన విషయాలన్నీ ఏమాత్రం పొల్లుపోకుండా జరిగాయంటూ గతంలో జరిగిన కొన్ని సంఘటలను గుర్తు చేస్తున్నారు.
తాజాగా వేణు స్వామి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో పలుసార్లు పవన్ కల్యాణ్ పై నెగెటివ్ కామెంట్స్ చేసిన ఆయన ఈసారి మాత్రం కాస్త డిఫరెంట్ టోన్ లో మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారనీ జనాలకు భగవంతుడి మీద అవగాహన కల్పిస్తున్నారనీ అన్నారు. వారాహి అమ్మవారిని జనాలకు పరిచయం చేసింది పవన్ కళ్యాణే అనీ అంతేకాదు ఆయన తన వాహనం పేరు కూడా వారాహి అని పెట్టుకుని అమ్మవారిని ఇష్టంగా ఆరాధిస్తున్నారనీ చెప్పారు. పవన్ కల్యాణ్ చేస్తున్నది మంచి పనులే అనీ తమలాంటి వాళ్లు చెప్తే ఓ 10 మంది, 20 మంది చూస్తారు కానీ పవన్ కల్యాణ్ చెప్తే లక్షల మంది ఆయనను ఫాలో అవుతారనీ అన్నారు. పవన్ కల్యాణ్ వారాహి అమ్మవారిని అంతగా పూజించినందునే ఆయనకు అదృష్టం అలా కలిసొచ్చిందని చెప్పారు. ప్రస్తుతం ఆయన ఏది పట్టుకున్నా మంచే జరుగుతుందనీ కామెంట్ చేసారు. ఆయనకు తిరుగు లేదనీ ఓటమి లేదనీ పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించారు వేణు స్వామి. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరలవుతన్నాయి. వీటిని చూసిన మెగా ఫాన్స్ వేణు స్వామిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
టేకాఫ్‌కి సిద్ధంగా ఉన్న విమానంలో పొగలు.. వీడియో
టీ, కాఫీ తాగితే నిజంగానే తల నొప్పి తగ్గుతుందా?
తప్పిపోయిన బాలికను పట్టించిన డ్రోన్ కెమెరా వీడియో
ఖతర్నాక్ దొంగలు.. రూ.100 చూపించి.. రూ.1.50 లక్షలు కొట్టేశారు వీడియో

జ్యోతిష్యం చెబుతుండగా తుర్రుమన్న చిలక.. ఆ తర్వాత

ప్రమాదంలో గాయపడిన కొండముచ్చు.. స్థానికులు ఏం చేశారంటే

ఆకలి మీదున్న పాము.. తేలును ఎలా మింగేసిందో చూడండి.. బాబోయ్

పదిహేను అడుగుల కింగ్ కోబ్రాల సయ్యాట..

రాములోరి గుడి సమీపాన అదో మాదిరి ఆకారం.. వెళ్లి చూడగా..

భార్య తల నరికి సైకిల్ బుట్టలో పెట్టుకున్న భర్త.. తర్వాత వీడియో

సైకిల్ పై గడ్డిమోపుతో ట్రంప్.. వీడియో వైరల్
