ఉదయాన్నే ఇవి తింటే గుండెపోటుకు చెక్ వీడియో
ఉరుకులు పరుగుల జీవితంలో మనిషిని ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం.. ఇందుకోసం ఆరోగ్యకమైన జీవనశైలిని అనుసరించడం అలాగే.. షోకాహారాన్ని తీసుకోవడం ప్రధానం. నిజానికి మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవడం వల్ల రోజు ఉత్సాహంగా ప్రారంభమవుతుంది. కానీ చాలా మంది పని తొందరలో ఉదయం టిఫిన్ తినరు.. ఇది సరైంది కాదు.
ఉదయం పనులకు వెళ్లే ముందు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఉదయం పూట టిఫిన్ దాటవేయడం వల్ల లిపోప్రొటీన్ LDL పెరుగుతుంది.. దీంతో ఊబకాయం, అధిక రక్తపోటు, మధుమేహం వ్యాధుల బారిన పడే అవకాశముంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగితే గుండెపోటు వంటి తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. దీన్ని నివారించి కొలెస్ట్రాల్‌ను తగ్గించి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం అల్పాహారంలో ఎలాంటివి తినాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఓట్ మీల్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.. అందుకే దానిని అల్పాహారంలో తప్పక తీసుకోవాలి. తరిగిన ఆపిల్, పియర్ లేదా స్ట్రాబెర్రీలను ఓట్ మీల్ లో కలపడం వల్ల ఫైబర్ శాతం మరింత పెరుగుతుంది.
మరిన్ని వీడియోల కోసం :
టేకాఫ్‌కి సిద్ధంగా ఉన్న విమానంలో పొగలు.. వీడియో
టీ, కాఫీ తాగితే నిజంగానే తల నొప్పి తగ్గుతుందా?
తప్పిపోయిన బాలికను పట్టించిన డ్రోన్ కెమెరా వీడియో
ఖతర్నాక్ దొంగలు.. రూ.100 చూపించి.. రూ.1.50 లక్షలు కొట్టేశారు వీడియో