Vijayawada: బాబు చాలా బిజీ.. నకిలీ పత్రాలతో ఏకంగా 658 సిమ్‌కార్డులు!
విజయవాడ నగరం గుణదలలో సత్యనారాయణపురానికి చెందిన పోలుకొండ నవీన్ అనే యువకుడు ఒకే ఫొటోతో 658 సిమ్‌కార్డులు పొందాడు. నవీన్ వీటిని రిజిస్టర్ చేసినట్లు గుర్తించిన డాట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే నగరానికి చెందిన అజిత్‌సింగ్‌నగర్, విస్సన్నపేట పోలీస్‌స్టేషన్ల పరిధిలో కూడా మరో 150 వరకు సిమ్‌కార్డులు నకిలీ పత్రాలతో జారీ అయినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారామంతా కృత్రిమ మేధస్సుతో వెలుగులోకి వచ్చింది. సిమ్ కార్డుల..
విజయవాడ, ఆగస్టు 9: ఒకే ఫొటోతో ఒకే నెట్ వర్క్‌తో ఓ వ్యక్తి వద్ద ఆరు వందలకుపైగా సిమ్ కార్డులు పోగేశాడు. అనుమానం వచ్చిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యునికేషన్స్ (డాట్) పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆసక్తికర విషయాలు వెలుగులోకొచ్చాయి. విజయవాడ నగరం గుణదలలో ఈ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
విజయవాడ నగరం గుణదలలో సత్యనారాయణపురానికి చెందిన పోలుకొండ నవీన్ అనే యువకుడు ఒకే ఫొటోతో 658 సిమ్‌కార్డులు పొందాడు. నవీన్ వీటిని రిజిస్టర్ చేసినట్లు గుర్తించిన డాట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే నగరానికి చెందిన అజిత్‌సింగ్‌నగర్, విస్సన్నపేట పోలీస్‌స్టేషన్ల పరిధిలో కూడా మరో 150 వరకు సిమ్‌కార్డులు నకిలీ పత్రాలతో జారీ అయినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారామంతా కృత్రిమ మేధస్సుతో వెలుగులోకి వచ్చింది. సిమ్ కార్డుల మోసాలను అరికట్టేందుకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యునికేషన్స్ కృత్రిమ మేధస్సుతో పనిచేసే ఓ టూల్‌కిట్ ఉపయోగించారు. సదరు ఏఐ టూల్ కిట్ వడపోతలో ఈ విషయం వెలుగుచూసింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఫేసియల్ రికగ్నేషన్ పవర్డ్ సొల్యూషన్ ఫర్ టెలికాం సిమ్ సబ్‌స్క్రైబర్ వెరిఫికేషన్ (ఏఎస్‌టీఆర్) అనే సాఫ్ట్‌వేర్ ద్వారా సిమ్‌కార్డు మోసాలను గుర్తించగలిగారు. ఈ టూల్ సంబంధిత నంబర్లను ఆటోమాటిక్‌గా బ్లాక్ చేసి, అన్ని టెలికాం ఆపరేటర్ల నుంచి సిమ్‌కార్డుదారుల ఐడీలను తీసుకుని వడపోస్తుంది. ఇలా చేయడంతో విజయవాడకు చెందిన నవీన్ దాదాపు 658 సిమ్‌లు తీసుకున్నట్లు బయటపడింది. నకిలీ పత్రాలతో జారీ అయిన సిమ్‌కార్డులు సంఘవిద్రోహ శక్తుల చేతుల్లోకి వెళితే విపరీత పరిణామాలు జరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఐతే నవీన్ పేరుతో రిజిస్టర్ అయిన ఈ సిమ్‌కార్డులన్నీ ఎవరు వినియోగిస్తున్నారు? ఎక్కడ ఉన్నాయి? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరో ఘటన.. విశాఖపట్నంలో ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య ఘటన
వైజాగ్ విషాదం చోటుచేసుకుంది. నగరంలోని మర్రిపాలెం ప్రకాశ్ నగర్‌కు చెందిన సంధ్య అనే వివాహిత తన ఇద్దరు పిల్లలతో అపార్టుమెంట్ నీటిసంపులో దూకి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. మంగళవారం అర్ధరాత్రి దాటాక మహిళ ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. మృతులు అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ కుటుంబానికి చెందిన సంధ్య, గౌతమ్(9), అలేఖ్య(5)గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. దర్యాప్తు అనందరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.