Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Elephant Whisperers Controversy: పీకల్లోతు వివాదంలో ‘ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌’ డైరెక్టర్‌.. లీగల్‌ నోటీసులు జారీ!

తమిళనాడు ముదుమలై రిజర్వ్‌ ఫారెస్ట్‌లో ఏనుగుల సంరక్షకులుగా పనిచేస్తున్న బెల్లీ, బొమ్మన్‌ దంపతుల యథార్థ గాథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారంటూ వారు పేర్కొన్నారు. పరిహారంగా రూ. 2 కోట్లు చెల్లించాలంటూ నోటిస్‌లో పేర్కొన్నారు. ఈ సినిమా తీసే సమయంలో తమకు ఆర్థిక సాయం చేస్తానని వాగ్థానం చేస్తామని దర్శకురాలు కార్తికి గోంజాల్వెస్‌ చెప్పినట్లు వెల్లడించారు. అనంతరం ఇచ్చిన మాట తప్పారని బెల్లీ, బొమ్మన్‌ దంపతులు నోటీస్‌లో పేర్కొన్నారు..

The Elephant Whisperers Controversy: పీకల్లోతు వివాదంలో ‘ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌’ డైరెక్టర్‌.. లీగల్‌ నోటీసులు జారీ!
The Elephant Whisperers Controversy
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 08, 2023 | 10:17 AM

డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగంలో ఇండియన్‌ మువీ ‘ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌’ ఆస్కార్‌ అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ డాక్యుమెంటరీ డైరెక్టర్‌ కార్తికి గోంజాల్వెస్‌ తాజాగా వివాదాల్లో చిక్కుకున్నారు. తమిళనాడుకు చెందిన బెల్లీ, బొమ్మన్‌ దంపతులు ఆమెకు రూ.2 కోట్ల లీగల్‌ నోటీసులు పంపించారు.

తమిళనాడు ముదుమలై రిజర్వ్‌ ఫారెస్ట్‌లో ఏనుగుల సంరక్షకులుగా పనిచేస్తున్న బెల్లీ, బొమ్మన్‌ దంపతుల యథార్థ గాథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారంటూ వారు పేర్కొన్నారు. పరిహారంగా రూ. 2 కోట్లు చెల్లించాలంటూ నోటిస్‌లో పేర్కొన్నారు. ఈ సినిమా తీసే సమయంలో తమకు ఆర్థిక సాయం చేస్తానని వాగ్థానం చేస్తామని దర్శకురాలు కార్తికి గోంజాల్వెస్‌ చెప్పినట్లు వెల్లడించారు. ఇప్పుడు ఇచ్చిన మాట తప్పారని బెల్లీ, బొమ్మన్‌ దంపతులు నోటీస్‌లో పేర్కొన్నారు.

తాము నివసించడానికి ఇల్లు, వాహనంతో పాటు తమ మనవరాలు చదువుకు కలెక్షన్స్‌లో కొంత భాగం ఇస్తామని కార్తికి తమకు మాటిచ్చిందన్నారు. ఐతే ఆమె ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా మోసం చేశారని తెలిపారు. ఆస్కార్ అవార్డు గెల్చుకున్న తర్వాత ప్రధాని మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి నుంచి పురస్కారాలు అందుకున్నారని, తమకు మాత్రం మొండిచేయి చూపారన్నారు. కార్తికి తమను పట్టించుకోవడం లేదని బొమ్మన్, బెల్లీ ఆరోపించారు. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో ఉండటం వల్ల ఎక్కువ విషయాలను వెల్లడించలేకపోతున్నామని, అవసరం అయితే తమ లాయర్‌ను సంప్రదించవచ్చని బెల్లీ, బొమ్మన్‌ దంపతులు మీడియాకు తెలిపారు. తమ వల్లనే ఆస్కార్‌ వచ్చినప్పటికీ సన్మాన సభల్లో ఆ అవార్డును కనీసం పట్టుకోనివ్వలేదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బెల్లీ, బొమ్మన్‌ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

కాగా తమిళనాడులోని ముదుమలై రిజర్వ్‌ ఫారెస్ట్‌లో బెల్లీ, బొమ్మన్‌ దంపతులు మావటిగా పనిచేస్తున్నారు. వీరి వాస్తవ జీవితం ఆధారంగా ‘ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌’ అనే షార్ట్‌ ఫిల్మ్‌ను రూపొందించారు. రఘు, అమ్ము అనే రెండు అనాథ ఏనుగు పిల్లల చుట్టూ ఈ కథ ఉంటుంది. వాటిని ఆదరించిన ఈ దంపతులను పాత్రధారులుగా చిత్రం రూపుదిద్దుకుంది. గునీత్‌ మోగ్న నిర్మాతగా వ్యవహరించగా కార్తికి గోంజాల్వెస్‌ దర్శకత్వంలో ఈ కథను తెరకెక్కించారు. 42 నమిషాల నిడివి గల ఈ చిత్రం ఆస్కార్‌ 2023లో ఉత్తమ లఘు చిత్రంగా ఎంపికయ్యి అవార్డు సొంతం చేసుకుంది.

బెల్లీ, బొమ్మన్‌ దంపతుల ఆరోపణలను చిత్ర దర్శకురాలు కార్తికి గోంజాల్వెస్‌ తోసిపుచ్చారు. ఈ దంపతుల మాటల్లో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. అవన్నీ పూర్తిగా నిరాధారమైన ఆరోపణలని తాజాగా ఆ చిత్ర నిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చింది. కాగా ఆస్కార్‌ గెలుచుకున్న ఈ భారతీయ చిత్ర దర్శకురాలికి లీగల్‌ నోటీసులు పంపించడం చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.