Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha Ruth Prabhu: సింగర్ చిన్మయి కవలలతో సామ్‌ ఆటపాటలు.. క్యూట్ వీడియో మీరూ చూసేయండి

గాయని చిన్నయి, రాహుల్ రవీంద్ర గతేడాది కవలలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆదివారం చిన్నయి ఇంటికి వెళ్లిన సామ్‌ అక్కడ పిల్లలతో ఆటలాడి సందడి చేసింది. చిన్మయి కొడుకుని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆర్‌ఆర్‌ఆర్‌ మువీలోని నాటునాటు పాటకు స్టెప్పు లేయించింది. ఇందుకు సంబంధించిన వీడియోలను సామ్‌ తన ఇన్‌స్టా ఖాతాలో షేర్‌ చేసింది. దీంతో ఈ వీడియోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అంతేకాకుండా చిన్మయి..

Samantha Ruth Prabhu: సింగర్ చిన్మయి కవలలతో సామ్‌ ఆటపాటలు.. క్యూట్ వీడియో మీరూ చూసేయండి
Samantha Dance With Chinmayi Children
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 07, 2023 | 3:04 PM

టాలీవుడ్‌ స్టార్‌ నటి సమంత సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతూ అభిమానులతో టచ్‌లో ఉంటారు. తాజాగా సామ్‌ సినిమాలకు కాస్త బ్రేక్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా మయోసైటిస్‌తో బాధపడుతున్న సామ్‌ ట్రీట్‌మెంట్‌ కోసం ప్రొఫెషనల్‌ లైఫ్‌ నుంచి కాస్త విరామం తీసుకుని వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తోంది. ఇటీవల తన స్నేహితురాలితో కలిసి బాలి ట్రిప్‌కు వెళ్లిన సామ్‌ ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్టుచేసి హంగామా చేసింది. అక్కడి నుంచి తిరిగి వచ్చాక చెన్నైలో ఉన్న తన మరో ఫ్రెండ్ ఇంటికి వెళ్లింది. ఎవరా ఫ్రెండ్‌ అనుకుంటున్నారా? ప్రముఖ గాయని, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ అయిన చిన్మయి శ్రీపాద ఇంటికే.

గాయని చిన్నయి, రాహుల్ రవీంద్ర గతేడాది కవలలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆదివారం చిన్నయి ఇంటికి వెళ్లిన సామ్‌ అక్కడ పిల్లలతో ఆటలాడి సందడి చేసింది. చిన్మయి కొడుకుని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆర్‌ఆర్‌ఆర్‌ మువీలోని నాటునాటు పాటకు స్టెప్పు లేయించింది. ఇందుకు సంబంధించిన వీడియోలను సామ్‌ తన ఇన్‌స్టా ఖాతాలో షేర్‌ చేసింది. దీంతో ఈ వీడియోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అంతేకాకుండా చిన్మయి కవల పిల్లలు శర్వాస్‌, ద్రిప్తాలతో కుర్చీతో ఆడుకుంటున్న ఫొటోలు కూడా సామ్‌ షేర్‌ చేసింది. ‘మై మోస్ట్‌ హ్యాండ్సమ్ గాడ్ సన్ శర్వాస్’ అనే క్యాప్షన్‌తో ఒక వీడియోను షేర్‌ చేసింది. ‘ఇప్పుడు కిడ్నాప్ చేయడానికి ఎలా ప్లాన్ చేయాలి’ అనే క్యాప్షన్‌తో మరో వీడియోను అభిమానులతో పంచుకుంది.

ఇవి కూడా చదవండి

కాగా రాహుల్‌ రవీంద్ర, చిన్నయి శ్రీపాదలకు సామ్‌ మంచి ఫ్రెండ్. సామ్‌ నటించిన అనేక మువీలకు సమంత డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా కూడా పనిచేశారు. ఆరోగ్యం నుంచి కోలుకోవడానికి సామ్‌ ఆరు నెలలపాటు విరామం తీసుకుని వ్యక్తి గత జీవితాన్ని గడుపుతోంది. సామ్‌ అమెరికాలో మయోసైటిస్‌కు చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

ఇక సినిమాల విషయానికొస్తే.. సమంత చివరిసారిగా దర్శకుడు గుణశేఖర్‌ తెరకెక్కించిన పౌరాణిక సినిమా ‘శాకుంతలం’ లో శకుంతల పాత్రలో నటించింది. ఐతే ఈ మువీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయినా సామ్ నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. విజయ్‌ దేవరకొండ సరసన ‘ఖుషి’ చిత్రంలో సమంత నటించింది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మువీ సెప్టెంబర్‌ 1న విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే ‘సిటాడెల్‌’ వెబ్‌సిరీస్‌లోనూ సామ్‌ నటిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.