Employee Chat Viral: పీకల్దాకా తాగి అర్ధరాత్రి బాస్‌కి మెసేజ్ పంపిన ఉద్యోగి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

తాగి ఎక్కడ పడితే అక్కడ న్యూసెన్స్‌ క్రియేట్‌ చేస్తే అందుకు తగిన మొత్తంలో పరిహారం చెల్లించుకోవల్సి ఉంటుంది. పీకల్దాకా తాగి కంపెనీ బాస్‌తో మాట్లాడితే.. ఇంకేముంది ఉద్యోగం హుష్‌కాకి. తాజాగా ఓ ఉద్యోగి ఫూటుగా తాగి ఏ మాత్రం జంగుబొంగు లేకుండా తన కంపెనీ బాస్‌కి మెసేజ్ పెట్టాడు. అదీ అందరూ గాఢ నిద్రలో ఉండగా అర్ధరాత్రి వేళప్పుడు పెట్టాడు. ఉద్యోగి నుంచి బాస్‌కి ఊహించని మెసేజ్ ఊహించని టైంలో రావడంతో షాక్‌కు గురైన తన కింద ఉద్యోగి స్వామి భక్తికి ఫిదా..

Employee Chat Viral: పీకల్దాకా తాగి అర్ధరాత్రి బాస్‌కి మెసేజ్ పంపిన ఉద్యోగి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
Employee Chat Viral
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 06, 2023 | 7:46 PM

తాగి మాట్లాడితే తాగుబోతు మాట్లాడాడని లెక్కలోనుంచి తీసిపారేస్తారు. ఐతే కొంత మంది మాత్రం మందు చుక్క పడితేనే నోటి వెంట అన్నీ నిజాలు దారాలంగా వస్తాయంటారు. అలాగని తాగి ఎక్కడ పడితే అక్కడ న్యూసెన్స్‌ క్రియేట్‌ చేస్తే అందుకు తగిన మొత్తంలో పరిహారం చెల్లించుకోవల్సి ఉంటుంది. పీకల్దాకా తాగి కంపెనీ బాస్‌తో నోటికి వచ్చినట్లు మాట్లాడితే.. ఇంకేముంది ఉద్యోగం హుష్‌కాకి. తాజాగా ఓ ఉద్యోగి ఫూటుగా తాగి ఏ మాత్రం జంగుబొంగు లేకుండా తన కంపెనీ బాస్‌కి మెసేజ్ పెట్టాడు. అదీ అందరూ గాఢ నిద్రలో ఉండగా అర్ధరాత్రి వేళప్పుడు పెట్టాడు. ఉద్యోగి నుంచి బాస్‌కి ఊహించని మెసేజ్ ఊహించని టైంలో రావడంతో షాక్‌కు గురైన తన కింద ఉద్యోగి స్వామి భక్తికి ఫిదా అయ్యాడు. వీరి చాటింగ్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలింతకీ బాస్‌కి ఏమని మెసేజ్ చేశాడంటే..

సిద్ధాంత్ అనే వ్యక్తి తన కంపెనీలో పని చేసే ఉద్యోగి నుంచి అర్థరాత్రి ఊహించని మెసేజ్ అందుకున్నాడు. ‘బాస్ నేను మధ్యం సేవించి ఉన్నాను. కానీ నేను ఈ విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. నన్ను నమ్మినందుకు మీకు ధన్యవాదాలు. మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించడం కంటే మంచి మేనేజర్ పొందడం చాలా కష్టం. ఆ విషయంలో నేను అదృష్టవంతుడిని. అందుకే మిమ్మల్ని మీరు అభినందించుకోండని బాస్‌ని పొగుడుతూ మెసేజ్‌ చేశాడు.

ఇవి కూడా చదవండి

ఈ మెజేస్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను సిద్ధాంత్ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ‘ఎక్స్ నుంచి ఇలాంటి డ్రంక్ టెక్ట్స్ మెసేజ్‌ అందుకోవడం పర్వాలేదు. కానీ మీరెప్పుడైనా ఇలాంటి డ్రంక్ టెక్ట్స్‌లు అందుకున్నారా..? ‘ అనే క్యాప్షన్‌తో సదరు పోస్ట్‌ను ట్వీట్‌ చేశాడు. ఈ మెసేజ్‌ చూసిన నెటిజన్లు భిన్న రీతిలో స్పందిస్తున్నారు. చాలా మంది ఉద్యోగులకు తమ పై అధికారులు ఛాండామర్కులుగా ఉంటారు. కానీ ఈ వ్యక్తి చాలా అదృష్టవంతుడు. మీలాంటి మంచి వ్యక్తి అతనికి బాస్‌గా లభించడం నాకు సంతోషంగా ఉందని ఒకరు, ఈ మెసేజ్‌ చూశాక మీలాంటి వ్యక్తి నాకు కూడా బాస్‌గా దొరికితే బాగుండు అని అనిపిస్తుంది. మీ కంపెనీ ఉద్యోగులు చాలా అదృష్టవంతులు అని మరొకరు, ఇది నిజంగా చాలా గొప్ప విషయం. మద్యం తాగిన వాడు అన్నీ నిజాలే చెబుతాడని ఇంకొకరు కామెంట్ సెక్షన్‌లో తమ అభిప్రాయాలను తెలియజేశారు. సిద్దాంత్‌కు మెసేజ్ పంపిన అతని ఉద్యోగిని మరింత మంది ప్రశంసిస్తూ మెజేస్‌లు పెట్టారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.