Haryana Violence: హర్యానాలో టెన్షన్.. టెన్షన్.. నేడు ఆ ప్రదేశాల్లోని మసీదుల్లో ప్రార్థనలు నిషేధం!

హర్యానా రాష్ట్రంలో అల్లర్లు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం మత ప్రార్ధనలను ఆ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ముఖ్యంగా ముస్లింలు అధికంగా ఉండే నుహ్‌ జిల్లాతోపాటు పలు ప్రాంతాల్లో శుక్రవారం మసీదుల్లో ప్రార్ధనలు నిర్వహించరాదని హర్యానా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హింసాత్మక ప్రాంతాల్లోని మసీదులు ఈ వారంలో ఆరుగురు ప్రాణాలు..

Haryana Violence: హర్యానాలో టెన్షన్.. టెన్షన్.. నేడు ఆ ప్రదేశాల్లోని మసీదుల్లో ప్రార్థనలు నిషేధం!
Haryana Violence
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 04, 2023 | 4:32 PM

గురుగ్రాం, ఆగస్టు 4: హర్యానా రాష్ట్రంలో అల్లర్లు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం మత ప్రార్ధనలను ఆ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ముఖ్యంగా ముస్లింలు అధికంగా ఉండే నుహ్‌ జిల్లాతోపాటు పలు ప్రాంతాల్లో శుక్రవారం మసీదుల్లో ప్రార్ధనలు నిర్వహించరాదని హర్యానా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  మసీదుల్లో ఈ వారంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలసిందే. ఈ సందర్భంగా నేడు బహిరంగ ప్రదేశాల్లో నమాజ్‌ చేయవద్దని, ఇళ్ల వద్దే ప్రార్థనలు చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

హర్యానా హింసకు కారణం ఏంటి?

హర్యానాలోని ముస్లింలు అధికంగా ఉండే నుహ్ జిల్లాలో జూలై 31న (సోమవారం) విశ్వహిందూ పరిషత్ ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా రెండు గ్రూపుల మధ్య మత ఘర్షణలు చెలరేగాయి. ఈ అల్లర్లలో ఇద్దరు హోంగార్డులు, ఒక మత గురువుతో సహా ఆరుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయ పడ్డారు. అనేక వాహనాలు, దుకాణాలకు అల్లరి మూక నిప్పు పెట్టారు. ఘర్షణ తలెత్తిన ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు.

గురుగ్రామ్ జిల్లాలో మంగళవారం అర్థరాత్రి నిరసనకారులు 5 గోడౌన్లకు నిప్పు పెట్టారు. మరో రెండు దుకాణాలను ధ్వంసం చేశారు. బుధవారం నాడు 2 వాహనాలు, ఒక టీ దుఖాణాన్ని ధ్వంసం చేశారు. మరో ప్రాంతంలో కొన్ని ఇళ్లకు సైతం నిప్పంటించారు. గురుగ్రామ్‌లో ఇంకా కాల్పులు, విధ్వంసాలు కొనసాగుతున్నందున బుధవారం కేంద్ర బలగాలు అధిక సంఖ్యలో మోహరించాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 176 మంది అరెస్టుకాగా, మరో 90 మందికిపైగా అదుపులోకి తీసుకున్నారు. అల్లరిమూకపై 41 కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇంటర్నెట్‌ బంద్!

సోమవారం సాయంత్రం 4 గంటల నుంచే నుహ్‌ జిల్లాలో ఇంటర్నెట్‌ సేవలను నిలిపేశారు. శాంతి భద్రతల దృష్ట్యా ఆగస్టు 2 వరకు విధించిన ఆంక్షలను ఆగస్టు 5 వరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ప్రజలు నిత్యావసర వస్తువుల కొనుగోలు చేసేందుకు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇంటర్నెట్‌ని పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు.నుహ్, గురుగ్రామ్, ఇతర ప్రభావిత జిల్లాల్లో నిషేధ ఉత్తర్వులు అమలులో ఉన్నాయి.

ఘర్షణలు జరిగిన రోజుకు సంబంధించి 2,300 వీడియోలను పరిశీలిస్తున్నామని, ప్రజలను రెచ్చగొట్టే వీడియోలను పోస్ట్ చేసిన మూడు ఖాతాలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. గురుగ్రామ్, నుహ్‌ ఇతర ప్రదేశాల్లో పోలీసులు కఠినమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. హింసాత్మక ప్రాంతాలలో అన్ని మసీదుల వద్ద శాంతిభద్రతల దృష్ట్యా భారీగా భద్రతా బలగాలు మోహరించాయి. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొనడంతో సంఘ వ్యతిరేక వ్యక్తులపై నిఘా ఉంచామని పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.