Seema Haider: పాక్‌ మహిళ సీమా హైదర్‌ కేసులో మరో ట్విస్ట్.. ఏకంగా బాలీవుడ్‌ మువీలో ఛాన్స్..? కీలక పాత్రలో

గేమింగ్ యాప్‌లో పరిచయమైన వ్యక్తిని వివాహం చేసుకోవడానికి అక్రమంగా దేశ సరిహద్దు దాటిన పాక్‌ మహిళ సీమా హైదర్ మరోమారు వార్తల్లో నిలిచింది. ఈసారి సినిమాల్లో నటించి స్టార్‌డమ్‌ కొట్టాలని యత్నిస్తోంది. బాలీవుడ్‌లో ఓ మువీలో నటించేందుకు ఆడిషన్‌కి వెళ్లినట్లు సమాచారం. ఉదయ్‌పూర్‌ టైలర్‌ హత్యోదంతం కథాంశంగా హిందీలో రూపొందించనున్న 'ఎ టైలర్ మర్డర్ స్టోరీ' పేరుతో దాదాపు రూ. 25 కోట్ల నుండి రూ. 30 కోట్ల బడ్జెట్‌తో చిత్రాన్ని తీస్తున్నారని టాక్‌. ఈ చిత్రం ఉదయపూర్..

Seema Haider: పాక్‌ మహిళ సీమా హైదర్‌ కేసులో మరో ట్విస్ట్.. ఏకంగా బాలీవుడ్‌ మువీలో ఛాన్స్..? కీలక పాత్రలో
Pakistan Woman Seema Haider
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 03, 2023 | 2:36 PM

ముంబయి, ఆగస్టు 2: గేమింగ్ యాప్‌లో పరిచయమైన వ్యక్తిని వివాహం చేసుకోవడానికి అక్రమంగా దేశ సరిహద్దు దాటిన పాక్‌ మహిళ సీమా హైదర్ మరోమారు వార్తల్లో నిలిచింది. ఈసారి సినిమాల్లో నటించి స్టార్‌డమ్‌ కొట్టాలని యత్నిస్తోంది. బాలీవుడ్‌లో ఓ మువీలో నటించేందుకు ఆడిషన్‌కి వెళ్లినట్లు సమాచారం. ఉదయ్‌పూర్‌ టైలర్‌ హత్యోదంతం కథాంశంగా హిందీలో రూపొందించనున్న ‘ఎ టైలర్ మర్డర్ స్టోరీ’ పేరుతో దాదాపు రూ. 25 కోట్ల నుండి రూ. 30 కోట్ల బడ్జెట్‌తో చిత్రాన్ని తీస్తున్నారని టాక్‌. ఈ చిత్రం ఉదయపూర్ టైలర్ కన్హయ్య లాల్‌ను ఇస్లామిక్ రాడికల్స్ హత్య చేసిన కథ ఆధారంగా రూపొందిస్తున్నారు. జానీ ఫైర్‌ఫాక్స్ ప్రొడక్షన్ హౌస్ ఈ మువీలో నటించడానికి సీమాను ఆడిషన్ చేసిందట. జయంత్ సిన్హా, భరత్ సింగ్ దర్శకత్వం వహించనున్నారు. సీమా ఆడిషన్ సమయంలో ఇద్దరు దర్శకులూ ఉన్నారట. ఈ సినిమాలో రా ఆఫీసర్ పాత్రలో సీమా కనిపించనున్నట్లు వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

కాగా పాకిస్థానీ ఐఎస్‌ఐ ఏజెంట్‌గా అనుమానిస్తూ ఉత్తరప్రదేశ్‌లోని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఎటీఎస్) సీమాను విచారిస్తోంది. పోలీసుల నుంచి క్లీన్‌ చిట్‌ పొందిన తర్వాత ఈ సినిమా ఆఫర్‌ని అంగీకరిస్తానని సీమా చెప్పినట్లు సమాచారం.

ఎవరీ సీమా హైదర్..

ఇవి కూడా చదవండి

సీమా హైదర్ (30) పాకిస్తానీ మహిళ. గ్రేటర్ నోయిడాలోని రబుపురా ప్రాంతంలో నివసిస్తున్న 22 ఏళ్ల సచిన్ మీనా అనే వ్యక్తితో కోవిడ్-19 మహమ్మారి సమయంలో పబ్‌జీ గేమ్‌ ద్వారా పరిచయం ఏర్పడింది. అప్పటికే సీమాకు గులాం హైదర్‌ అనే వ్యక్తితో పెళ్లై నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. ప్రియుడిని పెళ్లాడటానికి సీమా తన నలుగురు పిల్లలతో సహా దేశ సరిహద్దును అక్రమంగా దాటి భారత్‌లో ప్రవేశించింది. ఆమెను ఐఎస్‌ఐ ఏజెంట్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె సోదరుడికి పాక్‌ సైన్యంతో ఉన్నట్లు ఆమె భర్త ఇటీవల మీడియాకు తెలిపాడు. ప్రస్తుతం ఆమె బెయిల్‌పై విడుదలై ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడాలో నివాసం ఉంటోంది. ఆమెను ఇటీవల సినీ దర్శకులు సంప్రదించి సినిమా ఛాన్స్‌ ఇచ్చారని ఇండియా టుడే పేర్కొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?