AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Account: బ్యాంకింగ్ రూల్స్‌లో భారీ మార్పులు.. బ్యాంక్ అకౌంట్ ఉన్నవారందరూ ఈ ఒక్క పని చేయాల్సిందే.. లేకపోతే ఇబ్బందులే..

మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా..? అయితే తప్పనిసరిగా ఈ పని చేయాల్సిందే. లేకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. మీ కుటుంబసభ్యులకు కూడా చిక్కులు ఎదురుకావొచ్చు. దేశంలో బ్యాంక్ ఖాతా కలిగి ఉన్న ప్రతీఒక్కరూ ఈ పని చేయడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి.

Bank Account: బ్యాంకింగ్ రూల్స్‌లో భారీ మార్పులు.. బ్యాంక్ అకౌంట్ ఉన్నవారందరూ ఈ ఒక్క పని చేయాల్సిందే.. లేకపోతే ఇబ్బందులే..
Bank Account
Venkatrao Lella
|

Updated on: Mar 15, 2026 | 8:11 AM

Share

దేశంలో బ్యాంక్ అకౌంట్ లేనివారంటూ ఎవరూ ఉండరు. ఆర్దిక కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు ప్రతీఒక్కరూ బ్యాంక్ ఖాతా కలిగి ఉంటారు. బ్యాంక్ అకౌంట్ లేనిది మీరు ఎలాంటి నగదు ట్రాన్సక్షన్లు చేయలేరు. డీబీటీ పద్దతితో ప్రభుత్వాల నుంచి పథకాల సొమ్ము అందుకోవాలన్నా బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరి. అయితే బ్యాంక్ అకౌంట్ ఉన్నవారు తప్పనిసరిగా ఓ పని చేయాల్సిందే. అదేంటంటే.. నామినీని యాడ్ చేయడం. ఇప్పటివరకు మీ బ్యాంక్ ఖాతాకు నామినీని యాడ్ చేయకపోతే ఇప్పటికైనా సరే వెంటనే యాడ్ చేసుకోండి. దీని వల్ల అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. గతంలో ఉన్న నామినీ నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

కొత్త నిబంధనలు

నలుగురు వ్యక్తులను నామినీగా మీరు ఎంచుకోవచ్చు. గత ఏడాది నవంబర్ నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనలను తీసుకొచ్చింది. గతంలో కేవలం ఒక్క వ్యక్తిని మాత్రమే నామినీగా పొందుపర్చే నిబంధన ఉండేది. కానీ ఇక నుంచి మీరు నలుగురు వ్యక్తులను నామినీగా చేర్చవచ్చు. ఎవరికి ఎంత శాతం వాటా ఇవ్వాలనేది కూడా మీరే నిర్ణయించుకోవచ్చు. మీ లైఫ్ పార్ట్‌నర్‌కు 50 శాతం, పిల్లలకు 50 శాతం తరహాలో మీరే వాటా నిర్ణయించవచ్చు.

ప్రయోజనాలు ఏంటంటే..?

-ఒకవేళ మీరు ప్రమాదవశాత్తూ మరణిస్తే మీ నామినీ మీ అకౌంట్లోకి డబ్బులను తీసుకోవచ్చు

-నామినీ యాడ్ చేస్తే కుటుంబసభ్యులు ఎలాంటి సాంకేతిక సమస్యలు ఎదురుకాకుండా డబ్బులు తీసుకోవచ్చు

-నామినీని యాడ్ చేయకపోవడం వల్ల బ్యాంక్ ఖాతాల్లో అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు పెరుగుతున్నాయి. దీనిని తగ్గించేందుకు నలుగురు నామినీ నిబంధనను తీసుకొచ్చారు

నష్టాలేంటి..?

ఒకవేళ మీరు నామినినీ యాడ్ చేయకపోతే అనుకోని పరిస్థితుల్లో మరణించినప్పుడు మీ కుటుంబసభ్యులు మీ అకౌంట్లోకి డబ్బులను తీసుకోలేరు. దీని వల్ల కుటుంబసభ్యులకు మీరు ఆర్ధిక భరోసా కల్పించలేరు. మీ అకౌంట్లోని డబ్బులను క్లెయిమ్ చేయాలంటే కుటుంబసభ్యులు కోర్టులు, బ్యాంకుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. అఫిడవిట్, లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అంటూ అనేక డాక్యుమెంట్స్ సమర్పించాల్సి ఉంటుంది. మీ మరణాంతరం కుటుంబసభ్యులు ఇబ్బంది పడతారు. మీ కుటుంబసభ్యులు ఇబ్బంది పడకుండా ఉండాలంటే మీరే వెంటనే మీ బ్యాంక్ అకౌంట్‌కు నామినీని యాడ్ చేయాలని బ్యాంకింగ్ రంగ నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవల బ్యాంక్ అకౌంట్లలో మిగిలిపోయిన అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లపై ఆర్బీఐ ప్రత్యేక దృష్టి పెట్టింది. వీటిని క్లెయిమ్ చేసుకునేందుకు ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తోంది. 10 సంవత్సరాలుగా వాడని బ్యాంక్ అకౌంట్లలోని సొమ్మును విత్ డ్రా చేసుకోవాలని సూచిస్తోంది. లేకపోతే అకౌంట్‌ను యాక్టివ్ చేసుకోవాలని సూచిస్తోంది.

Follow Us
స్కూల్ ఎడ్యుకేషన్‌లో సరికొత్త టెక్నాలజీ.. డిజిటల్ మూల్యాంకనంతో..
స్కూల్ ఎడ్యుకేషన్‌లో సరికొత్త టెక్నాలజీ.. డిజిటల్ మూల్యాంకనంతో..
ఆ హీరో నాకంటే చాలా చిన్నోడు.. అయినా నాకెంతో ధైర్యాన్ని ఇచ్చాడు..
ఆ హీరో నాకంటే చాలా చిన్నోడు.. అయినా నాకెంతో ధైర్యాన్ని ఇచ్చాడు..
ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు నిజంగానే అదృష్టాన్ని తీసుకొస్తారా?
ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు నిజంగానే అదృష్టాన్ని తీసుకొస్తారా?
బరువు తగ్గాలా? బీపీ కంట్రోల్‌లో పెట్టాలా? మందార టీ మీకోసమే!
బరువు తగ్గాలా? బీపీ కంట్రోల్‌లో పెట్టాలా? మందార టీ మీకోసమే!
ఎండలో అనారోగ్యానికి గురైతే బీమా వర్తిస్తుందా?
ఎండలో అనారోగ్యానికి గురైతే బీమా వర్తిస్తుందా?
కోహ్లీ విశ్వరూపం.. సరికొత్త చరిత్ర సృష్టించిన రన్ మెషీన్..!
కోహ్లీ విశ్వరూపం.. సరికొత్త చరిత్ర సృష్టించిన రన్ మెషీన్..!
టీవీ9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ సీజన్ 2 ఛాంపియన్‌గా టాటా గ్రూప్
టీవీ9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ సీజన్ 2 ఛాంపియన్‌గా టాటా గ్రూప్
అది ఇది తిని బోర్ కొట్టిందా..? కమ్మటి పెసర పునుగులు ఇలా చేయండి
అది ఇది తిని బోర్ కొట్టిందా..? కమ్మటి పెసర పునుగులు ఇలా చేయండి
గోవా వెళ్లాలనుకుంటున్నారా..? హైదరాబాద్ నుంచి ఇక ప్రతీరోజూ ట్రైన్
గోవా వెళ్లాలనుకుంటున్నారా..? హైదరాబాద్ నుంచి ఇక ప్రతీరోజూ ట్రైన్
నలుగురు స్నేహితుల జలసమాధి!
నలుగురు స్నేహితుల జలసమాధి!