Kothagudem: ‘ఇచట పాస్‌పోర్టు ఫొటోలు దిగిన వారికి టమాటాలు ఫ్రీ..ఫ్రీ..’ ఫొటోగ్రాఫర్ వినూత్న ఆఫర్
దేశ వ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కొన్ని చోట్ల కేజీ టమాట రూ.200 నుంచి రూ.300 వరకు విక్రయిస్తున్నరు. దీంతో టమాటా కొనాలంటే సామాన్యులు బెంబేలెత్తి పోతున్నారు. మరికొన్ని చోట్ల కనీవినని రీతిలో ఏకంగా టమాటా చోరీలకు పాల్పడుతున్నారు. విలువైన వస్తువుల జాబితాలో ప్రస్తుతం టమాట కూడా చేరిపోయింది. తాజాగా ఓ ఫొటోగ్రాఫర్..
కొత్తగూడెం, ఆగస్టు 3: దేశ వ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కొన్ని చోట్ల కేజీ టమాట రూ.200 నుంచి రూ.300 వరకు విక్రయిస్తున్నరు. దీంతో టమాటా కొనాలంటే సామాన్యులు బెంబేలెత్తి పోతున్నారు. మరికొన్ని చోట్ల కనీవినని రీతిలో ఏకంగా టమాటా చోరీలకు పాల్పడుతున్నారు. విలువైన వస్తువుల జాబితాలో ప్రస్తుతం టమాట కూడా చేరిపోయింది. తాజాగా ఓ ఫొటోగ్రాఫర్ తన వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి వినూత్న ఆలోచన చేశాడు. స్మార్ట్‌ఫోన్లు చేతిలోకొచ్చాక నానాటికీ పడిపోతున్న గిరాకీ కాస్తయినా పెరుగుతుందని ఏ స్పెషల్ ఆఫర్ ప్రకటించాడు. అదేంటంటే..
కొత్తగూడెం బస్టాండ్ కాంప్లెక్స్‌లో ఆనంద్ అనే వ్యక్తికి ఫొటో స్టూడియో ఉంది. గతంలో స్థానికంగా కలెక్టరేట్ ఉన్నప్పుడు వ్యాపారం బాగానే నడిచేది. ఇటీవల జిల్లా కలెక్టరేట్‌తోపాటు ఇతర ప్రధాన కార్యాలయాలను పాల్వంచ సమీపంలోని సమీకృత జిల్లా కార్యాలయానికి మార్చడంతో గిరాకీ తగ్గింది. గతంలో రోజుకు 20-30 మంది కస్టమర్లు వచ్చేశారు. ఇప్పుడు కనీసం రోజుకు ఇద్దరు ముగ్గురు కూడా రావడం లేదు. దీంతో కస్టమర్లను అకట్టుకోవడానికి టమాటా ఆఫర్ ప్రకటించాడు. తన వద్ద రూ.100లకు 8 పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు తీసుకున్న వారికి పావు కిలో టమాటా ఉచితం అంటూ ప్రకటించి జనాల దృష్టిని ఆకట్టున్నారు. ఈ మేరకు పట్టణంలోని ప్రధాన రోడ్ల కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశాడు. ఈ వినూత్న ప్రకటనను నగరవాసులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.
కట్ చేస్తే.. ఆనంద్ ఫొటో స్టూడియో ముందు జనాలు బారులు తీరారు. బుధవారం ఒక్కరోజే ఏకంగా 32 మంది కస్టమర్లు వచ్చారు. రూ.100 చెల్లించి 8 ఫొటోలు తీసుకున్న వారికి రూ.40 విలువైన పావు కిలో టమాటా ప్యాకెట్లు అందజేసినట్లు’ ఆనంద్ తెలిపాడు. ఆనంద్ వినూత్న ప్రచారానికి మంచి స్పందన లభించినట్లైంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.