ఐదేళ్ల బాలుడిని దత్తత తీసుకున్న జంట.. గదిలో బంధించి రోజూ చిత్రహింసలు! చివరికీ..
తమకు సంతానం లేదని ఓ జంట ఐదేళ్ల పిల్లాడిని దత్తత తీసుకున్నారు. తొలుత బాగానే చూసుకున్నా ఆ తర్వాత దంపతులిద్దరూ ఆ చిన్నారిని చిత్రహింసలకు గురి చేశారు. పసివాడనే కనికరం లేకుండా పైశాచికంగా బాలుడిని కొట్టిచంపారు. ఈ దారుణ ఘటన లండన్‌లో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని డెల్మాంట్‌కు చెందిన లారెన్, జాకబ్ మలోబెర్టి అనే దంపతులు పెన్సిల్వేనియాకు..
పెన్సిల్వేనియా, ఆగస్టు 2: తమకు సంతానం లేదని ఓ జంట ఐదేళ్ల పిల్లాడిని దత్తత తీసుకున్నారు. తొలుత బాగానే చూసుకున్నా ఆ తర్వాత దంపతులిద్దరూ ఆ చిన్నారిని చిత్రహింసలకు గురి చేశారు. పసివాడనే కనికరం లేకుండా పైశాచికంగా బాలుడిని కొట్టిచంపారు. ఈ దారుణ ఘటన లండన్‌లో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని డెల్మాంట్‌కు చెందిన లారెన్, జాకబ్ మలోబెర్టి అనే దంపతులు పెన్సిల్వేనియాకు చెందిన లాండన్ అనే 5 ఏళ్ల బాలుడిని దత్తత తీసుకున్నారు. ఈ ఏడాది జనవరి 30న తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న లాండన్‌ను ఆసుపత్రికి తీసుకొచ్చారు. చికిత్స చేపట్టిన వైద్యులు బాలుడి తల, మెడపై తీవ్ర గాయాలు ఉండటాన్ని గమనించారు.
బాలుడి తలపై తగిలిన గాయాల కారణంగా అతని మెడదుతోపాటు శరీరం అంతా మొద్దుబారిపోయింది. ఎవరో బాలుడిని తీవ్రంగా కొట్టి చిత్రహింసలకు గురి చేసినట్లు వైద్యులు గ్రహించారు. చికిత్స పొందుతూ ఫిబ్రవరి 7న లాండన్ మరణించాడు. పోస్టుమార్టం రిపోర్ట్‌లో బాలుడిని చిత్రహింసలకు గురి చేసినట్లు తేలడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అతని పెంపుడు తల్లి లారెన్, జాకబ్‌లను గత గురువారం అరెస్ట్ చేసినట్లు డెల్మాంట్ పోలీస్ చీఫ్ టిజె క్లోబుకర్ తెలిపారు. రేయింబవళ్లు టార్చర్ పెట్టి, అత్యంత కిరాతకంగా బాలుడిని చావకొట్టినట్లు తెలిపారు. తన 25 ఏళ్ల కెరీర్‌లో ఇలాంటి దారుణ ఘటన చూడలేదన్నారు.
నిందితులను కోర్టులో హాజరుపరచగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. వీరి కేసును వాదించడానికి లాయర్లందరూ నిరాకరించారు. మరో ట్విస్ట్ ఏంటంటే.. లాండన్‌కు ఆసుపత్రిలో చికిత్స జరుగుతున్న సమయంలో అతని పెంపుడు తల్లిదండ్రులు గో ఫండ్ ద్వారా 5,200 డాలర్ల నిధులు సేకరించారట. లాండన్‌ని పట్ల అతని పెంపుడు తల్లిదండ్రులు ద్వేషపూరితంగా ప్రవర్తించేవారని, ఇష్టం వచ్చినట్లు కొట్టేవారని, పిల్లాడి ఏడుపులు బయటిదాకా వినిపించేవని స్థానికులు వెల్లడించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.