AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యో పాపం.. 2 నిమిషాలు హిందీలో మాట్లాడి ఉద్యోగం పోగొట్టుకున్న టెకీ!

రెండు నిమిషాలు హిందీలో మాట్లాడినందుక ఓ టెకీ ఉద్యోగం పోగొట్టుకున్నాడు. చావుబతుకుల్లో ఉన్న బంధువుతో ఫోన్‌లో హిందీలో మాట్లాడాడని యాజమన్యం జాబ్‌ నుంచి తొలగించింది. దీంతో తనకు న్యాయం చేయాలంటూ సదరు వ్యక్తి కోర్టు కొక్కాడు. అసలేం జరిగిందంటే.. భారత సంతతికి చెందిన అనిల్‌ వర్ష్నే (78) అమెరికాలో 2002 నుంచి అమెరికాలో లేయర్డ్ మిసైల్ డిఫెన్స్ ఏజెన్సీ విభాగంలో అమెరికా ఫెడరల్‌ ఏజెన్సీ తరుపున పార్సన్స్ కార్పొరేషన్‌ అనే సంస్థలో..

అయ్యో పాపం.. 2 నిమిషాలు హిందీలో మాట్లాడి ఉద్యోగం పోగొట్టుకున్న టెకీ!
Phone Call
Srilakshmi C
|

Updated on: Aug 02, 2023 | 4:02 PM

Share

వాషింగ్టన్‌, ఆగస్టు 2: రెండు నిమిషాలు హిందీలో మాట్లాడినందుక ఓ టెకీ ఉద్యోగం పోగొట్టుకున్నాడు. చావుబతుకుల్లో ఉన్న బంధువుతో ఫోన్‌లో హిందీలో మాట్లాడాడని యాజమన్యం జాబ్‌ నుంచి తొలగించింది. దీంతో తనకు న్యాయం చేయాలంటూ సదరు వ్యక్తి కోర్టు కొక్కాడు. అసలేం జరిగిందంటే.. భారత సంతతికి చెందిన అనిల్‌ వర్ష్నే (78) అమెరికాలో 2002 నుంచి అమెరికాలో లేయర్డ్ మిసైల్ డిఫెన్స్ ఏజెన్సీ విభాగంలో అమెరికా ఫెడరల్‌ ఏజెన్సీ తరుపున పార్సన్స్ కార్పొరేషన్‌ అనే సంస్థలో పనిచేస్తున్నారు. మిస్సైల్ డిఫెన్స్ కాంట్రాక్టర్‌ అయిన వర్ష్నే సీనియర్‌ సిస్టమ్స్‌ ఇంజనీరగ్‌గా అక్కడ విధులు నిర్వహిస్తున్నాడు.

2022 సెప్టెంబర్ 26న భారత్‌లో మరణశయ్యపై ఉన్న తన బావ కేసీ గుప్తాతో వీడియో కాల్‌ మాట్లాడాడు. తన బంధువు మరణ గడియల్లో ఉండటంతో మళ్లీ మాట్లాడే అవకాశం రాకపోవచ్చని ఎవరూ లేనిచోట ఖాళీ క్యాబిన్‌లో వర్ష్నే 2 నిముషాల పాటు మాట్లాడాడు. ఆ సమయంలో మిసైల్ డిఫెన్స్ ఏజెన్సీ (MDA)కి చెందిన వారు ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాతనే తాను కాల్ అటెంప్ట్‌ చేశాడు. ఐతే వర్ష్నే ఫోన్‌లో మాట్లాడటం చూసిన సహోద్యోగి ఒకరు ఇక్కడ ఫోన్‌ మాట్లాడకూడదని వారించాడు. దీంతో వర్ష్నే కాల్‌ కట్‌ చేశాడు. గుప్తా మరణించే ముందు అతనితో మాట్లాడిన చివరి ఫోన్‌ కాల్‌ అదే.

అర్ధం కాని భాషలో మాట్లాడాడని గూఢచారి ముద్ర!

ఐతే తనకు అర్ధం కాని భాషలో వర్ష్నే ఫోన్‌ కాల్‌ మాట్లాడాడని సహోద్యోగి తన పై అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఏజెన్సీకి సంబంధించిన గోప్య సమాచారం చేరవేశాడని, ఫోన్‌ మాట్లాడి భద్రతా ప్రమాణాలు ఉల్లంఘించాడనే ఆరోపణలతో అతన్ని ఉద్యోగం నుంచి అప్పటికప్పుడు తొలగించారు. అంతేకాకుండా భవిష్యత్తులో మిసైల్‌ డిఫెన్స్‌ ఏజెన్సీలో పనిచేయకుండా బ్లాక్‌ మార్క్‌ జారీ చేశారు. దీంతో వర్ష్నే జులై 24న సదరు ఏజెన్సీ కంపెనీపై కోర్టులో దావా వేశాడు. తనను అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించారని, వివక్షపూరితంగా పక్షపాతంతో తనపై ఆరోపణలు చేశారంటూ తన దావాలో పేర్కొన్నారు. అంతేకాకుండా కోర్టులో లాయర్ల ఫీజులు, ఖర్చులు కూడా కంపెనీయే భరించాలని దావాలో డిమాండ్‌ చేశారు.

ఇవి కూడా చదవండి
Anil Varshney

Anil Varshney

భారత్ నుంచి అమెకాకు వలస..

కాగా 1968లో అమెరికాకు వలస వచ్చిన వర్ష్నీ అమెరికా పౌరసత్వం పొంది అక్కడే స్థిరపడ్డాడు. ఆయన భార్య శశి 1989 నుంచి నాసాలో పనిచేస్తోంది. సిస్టమ్స్ ఇంజనీరింగ్‌ విభాగంలో భూమి ఆధారిత క్షిపణి రక్షణ కార్యక్రమంలో 5 మిలియన్లను ఆదా చేసినందుకు ఇదే కంపెనీలో ‘కాంట్రాక్టర్ ఆఫ్ ది ఇయర్’గా ప్రపంశలు కూడా అందుకున్నాడు. బాలిస్టిక్ క్షిపణి బెదిరింపుల నుంచి అమెరికాను, దాని భాగస్వామ్య దళాలను రక్షించే సమీకృత, లేయర్డ్ క్షిపణి రక్షణ వ్యవస్థల అభివృద్ధికి తాను ఎంతో కృషి చేశానని దావాలో పేర్కొన్నాడు. తన పూర్వ ఉద్యోగ రికార్డులను సైతం దావాలో ఎత్తిచూపాడు. తనపై వేసిన క్రమశిక్షణ రాహిత్య చర్యలను ఆపసంహరించుకోవాలని వర్ష్నీ కోరినట్లు దావా పేర్కొంది. ఒక వేళ తనను తిరిగి ఉద్యోగంలో చేర్చుకోకపోతే పూర్తి ప్రయోజనాలతో కూడిన ముందస్తు చెల్లింపులు, న్యాయవాద రుసుము, మానసిక వేదన అనుభవించినందుకు నష్టపరిహారాన్ని కోరారు. ఇక దీనిపై పార్సల్స్‌ కంపెనీ ఇంకా స్పందించలేదు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.