గంగవల్లి కూర మామిడికాయ పప్పు.. దీని రుచి ముందు నాన్ వెజ్ కూరలు జుజుబీ..
Prasanna Yadla
12 March 2026
Pic credit - Pixabay
మనం ఇప్పటి వరకు మామిడికాయ పప్పు మాత్రమే తెలుసు. కానీ, ఈ ఆకు కూరతో పప్పు చేస్తే రుచి అదిరిపోతోంది.
ఈ ఆకు కూరతో పప్పు చేస్తే..
గంగవల్లి కూర మామిడికాయ పప్పు చేసి తింటే నాన్ వెజ్ కూరలు కూడా ఏ మూలకు సరిపోవు.
గంగవల్లి కూర మామిడికాయ పప్పు
ఒక చిన్న మామిడికాయ, ఒక కప్పు కందిపప్పు, చిన్న ఉల్లిపాయలు 2, 5 పచ్చిమిర్చి, 5 వెల్లుల్లి రెబ్బలు,
ఒక టేబుల్ స్పూన్ కారం, అర టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పును తీసుకోవాలి.
కావాల్సిన పదార్ధాలు
మూడు టేబుల్ స్పూన్స్ నూనె, ఒక టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, ఒక టేబుల్ స్పూన్ ఎండు మిర్చి, 5 కరివేపాకు ఆకులు
కావాల్సిన పదార్ధాలు
ముందుగా కందిపప్పును తీసుకుని నీటితో శుభ్రం చేసి దానిలో గంగవల్లి కూర, కట్ చేసిన మామిడికాయ ముక్కలు, పచ్చి మిర్చి,
నిమ్మకాయంత చింతను స్టవ్ మీద ఉడికించుకోవాలి.
స్టెప్ - 1
పప్పు బాగా ఉడికిన తర్వాత దానిలో అర టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి.
స్టెప్ - 2
రోటిలో వెల్లుల్లి రెబ్బలులు దంచి ఆ మిశ్రమాన్ని పోపు గింజలతో తాలింపులో వేసి, వాటితో పాటు ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు పెట్టాలి అంతే వేడి వేడి పప్పు రెడీ.
స్టెప్ - 3
అన్నంలో ఈ పప్పును వేసుకుని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. కాబట్టి, మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి.