Watching TV: హలో బాసూ..! టీవీ చూస్తే మెమరీ లాసు… గంట కన్నా ఎక్కువ చూస్తే గజినిలా మారుతారట..!
స్కూలుకి వెళ్ళేముందు లేదా చదువుకోవటానికి ముందు టీవీ చూస్తే వారి ఏకాగ్రత, జ్ఞాపకశక్తిపై ప్రభావం పడుతుందని స్ట్రాంగ్ చెబుతున్నారు ఆస్ట్రేలియా పరిశోధకులు. మరి పరిస్థితి ఇలా ఉంటె దీనికి రెమిడీ ఏంటి..? జ్ఞాపకశక్తి పెరగడానికి ఏం చేయమంటారు..? ఇలాంటి ప్రశ్నలకు వారు సమాధానాలు కూడా వివరించారు. ఒక నెలరోజుల పాటు వారి సూచనలు పాటించినట్టయితే, తప్పక మార్పును గమనిస్తారంటూ వారు బలంగా చెబుతున్నారు. అందుకోసం వారు టీవీ చూడటం తగ్గించి ఇలాంటి కార్యకలాపాలపై దృష్టి సారించాలని చెబుతున్నారు. శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం..
గంటలు గంటలు టీవీ చూస్తున్నారా..? సినిమా సీరియల్స్, కార్టూన్స్ అంటూ ఎక్కువ సమయం టీవీకే అతుక్కుపోతున్నారా ? అయితే ఇంకేం మీరు త్వరలోనే గజినీ అవ్వడం ఖాయం.. అవును…అతిగా టీవీ చూస్తే.. మీరు మతిమరుపుకు కేరాఫ్ అడ్రస్ కావడం ఖాయం అంటున్నారు ఆస్ట్రేలియా సైటిస్ట్ లు. ప్రతి రోజు ఒక గంట కన్న తక్కువ టైం టీవీ చూస్తున్న వాళ్ళకి పొద్దస్తమానం టీవీ చూస్తున్న వారికి మధ్య మెమరీ విషయంలో చాలా వత్యాసం ఉందని ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలిందంట. అక్కడి సైటిస్ట్ లు అక్కడి ప్రజల్లో కొన్ని వేలమందిపై రకరకాల పరీక్షలు నిర్వహించి ఈ విషయాన్నీ తేల్చారు. ఎక్కువ సమయం టీవీ చూస్తున్నవారు నిత్య జీవితంలో చిన్న చిన్న విషయాలను కూడా మర్చిపోతున్నారని శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో గమనించారట.
ఇక్కడ మరో ముఖ్య విషయం ఏంటంటే.. మరీ ముఖ్యంగా చిన్న పిల్లల జ్ఞాపకశక్తిపై టీవీ చాలా ప్రభావాన్ని చూపిస్తుందని చెపుతున్నారు. స్కూలుకి వెళ్ళేముందు లేదా చదువుకోవటానికి ముందు టీవీ చూస్తే వారి ఏకాగ్రత, జ్ఞాపకశక్తిపై ప్రభావం పడుతుందని స్ట్రాంగ్ చెబుతున్నారు ఆస్ట్రేలియా పరిశోధకులు. మరి పరిస్థితి ఇలా ఉంటె దీనికి రెమిడీ ఏంటి..? జ్ఞాపకశక్తి పెరగడానికి ఏం చేయమంటారు..? అని వీరిని అడిగితే అందుకు చాలా మార్గాలున్నాయి.. కానీ టీవీ చూడటం తగ్గించమంటున్నాం.. కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా మిమ్మల్ని ఆహ్లాదపరిచే మరో మార్గం ఉంది. దానివల్ల జ్ఞాపక శక్తి పెరగడంతో పాటు మానసిక, శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది అంటున్నారు శాస్త్రవేత్తలు.
‘కాల్పనిక సాహిత్యం’ లాంటి పుస్తకాలు చదివితే మెదడు పదునెక్కుతుంది. జ్ఞాపకశక్తి పెరగుతుంది. మతిమరుపు తగ్గుతుంది. మానసిక ఉల్లాసం సొంతమవుతుంది. ఇదంతా నమ్మడం కష్టం అనిపిస్తుందా..? అయితే, ఒక నెల రోజులపాటు వారు చెప్పింది పాటించి చూడాలని చెబుతున్నారు ఆస్ట్రేలియా పరిశోధకులు. ఇంకేం ఇప్పటికే మతిమరుపు సమస్యతో బాధపడుతున్నవారు ఒకసారి టీవీ కి బ్రేక్ ఇచ్చి పుస్తకాలు చదవటం మొదలుపెడదామా?
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..