Mohd Azharuddin: హెచ్‌సీఏ అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తా.. అవినీతి అంతం చేయడమే లక్ష్యం..

Hyderabad: సుప్రీం కోర్ట్ నియమించిన రిటైర్డ్ జడ్జీ జస్టిస్‌ లావు నాగేశ్వరరావు.. అసోసియేషన్ నిబంధనలకు విరుద్ధంగా, విరుద్ధ ప్రయోజనాలు కలిగిన 57 క్రికెట్ క్లబ్‌లపై వేటు వేయడాన్ని అజారుద్దీన్ స్వాగతించారు. ఆయా క్లబ్‌లపై వేటు పడిన ఒక రోజు తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన అసోసియేషన్ అధ్యక్ష పదవి కోసం సెప్టెంబర్‌లో జరిగే ఎన్నికల్లో తన అభ్యర్ధిత్వాన్ని..

Mohd Azharuddin: హెచ్‌సీఏ అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తా.. అవినీతి అంతం చేయడమే లక్ష్యం..
Mohd Azharuddin
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Aug 02, 2023 | 1:34 PM

Mohd Azharuddin: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్(హెచ్‌సీఏ)‌లోని అవినీతిని అంతం చేసేందుకు దాని అధ్యక్ష పదవికి మళ్లీ పోటీ చేస్తానని టీమిండియా మాజీ కెప్టెన్‌ మహమ్మద్ అజారుద్దీన్‌ ప్రకటించారు. సుప్రీం కోర్ట్ నియమించిన రిటైర్డ్ జడ్జీ జస్టిస్‌ లావు నాగేశ్వరరావు.. అసోసియేషన్ నిబంధనలకు విరుద్ధంగా, విరుద్ధ ప్రయోజనాలు కలిగిన 57 క్రికెట్ క్లబ్‌లపై వేటు వేయడాన్ని ఆయన స్వాగతించారు. ఆయా క్లబ్‌లపై వేటు పడిన ఒక రోజు తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన అసోసియేషన్ అధ్యక్ష పదవి కోసం సెప్టెంబర్‌లో జరిగే ఎన్నికల్లో తన అభ్యర్ధిత్వాన్ని ప్రకటించారు.

అజారుద్దీన్ మాట్లాడుతూ ‘సెప్టెంబర్ 15న జరిగే హెచ్‌సీఏ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తాను. గత 14 ఏళ్లుగా కొనసాగిన వివాదంపై వేటు పడడం సంతోషంగా ఉంది. ఇన్నాళ్లూ అసోసియేషన్‌ను సరిగ్గా పనిచేయనివ్వలేదు. కానీ ఇప్పుడు అలా జరగదు. నేను ఏ క్లబ్‌కు యజమాని కాదు. మాజీ అంతర్జాతీయ ఆటగాడిగా నాకు అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతి ఉంది. అసోసియేషన్‌లో ఆట, సౌకర్యాలను మెరుగుపరచడమే ఇప్పుడున్న పెద్ద సవాలు. అర్ధికంగా కూడా స్వయంసమృద్ధి సాధించాలి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కి ఒక మైదానమే ఉంది. ఇతర అసోసియేషన్‌ల మాదిరిగా మరిన్నీ మైదానాలను కలిగి ఉండాలి. నా పదవికాలంలో 2 ఏళ్లు న్యాయపోరాటంలోనే గడిచిపోయింది. ఇకపై మిగిలిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా’ అని పేర్కొన్నారు.

కాగా, ఆఫీస్ బేరర్ల ఎన్నిక, ఐడెంటిటీ, ఓనర్‌షిప్ బదిలీ, మల్టిపుల్ ఓనర్‌షిప్ వంటి పరస్పర విరుద్ధ ప్రయోజనాల నేపథ్యంలో 57 క్లబ్‌ ప్రతినిధుల నుంచి వివరణ కోరిన రిటైర్డ్ జస్టిస్ నాగేశ్వర్ రావు.. వాటిపై చర్యలు తీసుకుంటూ జూలై 31న అదేశాలు జారీ చేశారు. జారీ అయిన అదేశాల మేరకు క్లబ్‌లకు చెందిన ఎగ్జిక్యూటీవ్ మెంబర్స్ మూడేళ్ల వరకు అసోసియేషన్ ఎలాంటి పదవీ బాధ్యతలు నిర్వర్తించకూడదు. ఇంకా ఆయా క్లబ్‌లకు ఓటింగ్ హక్కు ఉండదు. అలాగే ఈ ఈ క్లబ్‌ల జట్లకు అసోసియేషన్ లీగ్‌లు, టోర్నీల్లో ఆడేందుకు కూడా అనుమతి ఉందడు. ఇంకా ఈ నిషేధం కారణంగా మాజీ క్రికెటర్లు అర్షద్ అయూబ్, వంకా ప్రతాప్, మాజీ కార్యదర్శి ఆర్. విజయానంద్, మాజీ ఉపాధ్యక్షుడు కె. జాన్ మనోజ్, టి. శేష్ నారాయణ్, పి. యాదగిరి, సుదర్శన్ రాజు వంటి పలువురు అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత కోల్పోయారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..