ICC Rankings: హ్యాట్రిక్ అర్ధ సెంచరీలు.. ఐసీసీ ర్యాంకుల్లో దూసుకొచ్చిన టీమిండియా నయా సెన్సేషన్..
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ బుధవారం టెస్ట్ బ్యాటర్ల కొత్త ర్యాంకింగ్ జాబితాను ప్రచురించింది. ఈసారి కూడా న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్ అగ్రస్థానంలో నిలిచాడు. అయితే గతంలో మూడో ర్యాంక్‌లో ఉన్న ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ ఒక స్థానం ఎగబాకి రెండో ప్లేస్‌లోకి వచ్చాడు. అలాగే ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ రెండు స్థానాలు ఎగబాకి మూడు ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. అలాగే ఇంగ్లండ్ స్టార్ స్ట్రైకర్ హ్యారీ బ్రూక్..

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ బుధవారం టెస్ట్ బ్యాటర్ల కొత్త ర్యాంకింగ్ జాబితాను ప్రచురించింది. ఈసారి కూడా న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్ అగ్రస్థానంలో నిలిచాడు. అయితే గతంలో మూడో ర్యాంక్‌లో ఉన్న ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ ఒక స్థానం ఎగబాకి రెండో ప్లేస్‌లోకి వచ్చాడు. అలాగే ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ రెండు స్థానాలు ఎగబాకి మూడు ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. అలాగే ఇంగ్లండ్ స్టార్ స్ట్రైకర్ హ్యారీ బ్రూక్ మొదటిసారిగా టాప్ టెన్‌లోకి ప్రవేశించాడు.అయితే తాజా ర్యాంకుల్లో మరోసారి భారత్‌కు నిరాశే ఎదురైంది. టీమ్ ఇండియా నుంచి హిట్ మ్యాన్ కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్కడే టాప్-10 జాబితాలో చోటు దక్కించుకున్నాడు. రోహిత్ తర్వాత రిషబ్ పంత్ 12వ స్థానంలో ఉండగా, కింగ్ కోహ్లీ 14వ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు.
బౌలింగ్‌లో విభాగంలో రవిచంద్రన్ అశ్విన్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. అలాగే టెస్ట్ ఆల్‌రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక వన్డే ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. శుభ్‌మన్ గిల్ (7), విరాట్ కోహ్లీ(9) టాప్ టెన్‌లో ఉండడం గమనార్హం. వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మూడు మ్యాచ్‌ల్లోనూ హాఫ్ సెంచరీలు చేసిన ఇషాన్ కిషన్ 15 స్థానాలు ఎగబాకి 45వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. బౌలింగ్ విభాగంలో కూడా మహ్మద్ సిరాజ్ మాత్రమే టాప్ 10లో కొనసాగుతున్నాడు. ఇక టీ 20 ర్యాంకుల్లో సూర్య ప్రతాపం ఆగడం లేదు. ఇప్పటికీ ఈ మిస్టర్ 360 దే టాప్ ప్లేస్. సూర్య తర్వాత విరాట్ 14వ స్థానంలో ఉన్నాడు. అలాగే టీ 20 ఆల్‌రౌండర్లలో హార్డిక్ పాండ్యా రెండో ర్యాంకును సొంత చేసుకున్నాడు. మొత్తానికి ఐసీసీ ర్యాంకుల్లో భారత ఆటగాళ్లు నిరాశపరిచారనే చెప్పుకోవచ్చు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



