AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Por Thozhil OTT: ఓటీటీలోకి తమిళ్‌ సెన్సేషనల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?

ఇటీవల వేరే భాషల్లో విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచిన సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. ఇక్కడి ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా తెలుగు వెర్షన్‌ను కూడా అందుబాటలోకి తెస్తున్నాయి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌. ముఖ్యంగా తమిళ్‌, మలయాళ భాషలకు చెందిన సస్పెన్స్‌, ఇంటెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమాలు ఈ జాబితాలో ఉన్నాయి. అలా తాజాగా మరో తమిళ్‌ బ్లాక్‌ బస్టర్‌ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. అదే పోర్‌ తోడిల్‌. ఇంటెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో శరత్‌కుమార్‌, అశోక్‌ సెల్వన్‌, నిఖిలా విమల్‌ కీలక పాత్రల్లో నటించారు.

Por Thozhil OTT: ఓటీటీలోకి తమిళ్‌ సెన్సేషనల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?
Por Thozhil Movie
Basha Shek
|

Updated on: Aug 01, 2023 | 7:34 PM

Share

ఇటీవల వేరే భాషల్లో విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచిన సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. ఇక్కడి ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా తెలుగు వెర్షన్‌ను కూడా అందుబాటలోకి తెస్తున్నాయి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌. ముఖ్యంగా తమిళ్‌, మలయాళ భాషలకు చెందిన సస్పెన్స్‌, ఇంటెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమాలు ఈ జాబితాలో ఉన్నాయి. అలా తాజాగా మరో తమిళ్‌ బ్లాక్‌ బస్టర్‌ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. అదే పోర్‌ తోడిల్‌. ఇంటెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో శరత్‌కుమార్‌, అశోక్‌ సెల్వన్‌, నిఖిలా విమల్‌ కీలక పాత్రల్లో నటించారు. జూన్‌ 9 న విడుదలైన ఈ పోలీస్‌ ఇన్వెస్టిగేషన్‌ డ్రామా కోలీవుడ్‌లో రికార్డులు కొల్లగొట్టింది. బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ.50 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. దీంతో ఎప్పుడెప్పుడు పోర్‌ తోడిల్‌ మూవీ ఓటీటీలోకి వస్తుందా? అని ఆడియెన్స్‌ ఎదురుచూస్తున్నారు. ఇప్పుడీ నిరీక్షణకు తెరపడనుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ సోని లివ్‌ పోర్‌ తోడిల్‌ డిజిటిల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఈక్రమంలో ఆగస్టు 11 నుంచి ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నట్లు సోనీలివ్‌ ఓటీటీ అధికారికంగా ప్రకటించింది. తమిళ్‌తో పాటు తెలుగులోనూ పోర్‌ తోడిల్‌ మూవీ స్ట్రీమింగ్‌ కానున్నట్లు తెలుస్తోంది.

ఆ హత్యల వెనక ఉన్నదెవరు?

పోర్‌ తోడిల్‌ కథ విషయానికొస్తే.. ప్రకాశ్(అశోక్ సెల్వన్) క్రైమ్ బ్రాంచ్ పోలీస్ ఆఫీసర్. సీనియర్ ఆఫీసర్ లోకనాథ్(శరత్ కుమార్) దగ్గర ట్రైనీగా పనిచేసేందుకు వస్తాడు. టెక్నికల్ అసిస్టెంట్ వీణ(నిఖిలా విమల్) కూడా వీళ్లతో జతకడుతుంది. విధుల్లో భాగంగా తిరుచ్చిలో ఓ బాలిక హత్య కేసు వీళ్ల ముగ్గురు టేకప్ చేస్తారు. దీని గురించి ఇన్వెస్టిగేషన్‌ చేస్తున్న సమయంలోనే నగరంలో మరికొన్ని హత్యలు ఇదే రీతిలో జరుగుతాయి. మరి వీళ్లని చంపుతున్నది ఎవరు? అశోక్‌, శరత్ ఈ కేసును ఎలా ఛేదించారనేది తెలుసుకోవాలంటే పోర్‌ తోడిల్‌ సినిమా చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..