Samajavaragamana OTT: నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత.. ఓటీటీలో ‘సామజవరగమన’కు రికార్డు వ్యూస్..ఎక్కడ చూడొచ్చంటే?

ఏకే ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో రాజేష్ దండా నిర్మించిన సామజవరగమన జూన్‌ 23న థియేటర్లలో విడుదలైంది. ఫస్ట్‌ షో నుంచే సూపర్‌ హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్‌ వద్ద కనివినీ ఎరుగని రీతిలో కలెక్షన్లు సాధించింది. అల్లు అర్జున్‌, రవితేజ, సుమంత్‌, అడివిశేష్‌, నాగచైతన్య లాంటి స్టార్‌ హీరోలు సైతం ఈ మూవీని చూసి ఫిదా అయ్యారు. ఇలా థియేటర్లలో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచిన సామజవరగమన ఇప్పుడు ఓటీటీలోనూ అదరగొడుతోంది.

Samajavaragamana OTT: నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత.. ఓటీటీలో 'సామజవరగమన'కు రికార్డు వ్యూస్..ఎక్కడ చూడొచ్చంటే?
Samajavaragamana
Follow us
Basha Shek

|

Updated on: Sep 20, 2023 | 4:54 PM

టాలీవుడ్‌ ట్యాలెంటెడ్‌ హీరో శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్‌ సినిమా సామజవరగమన. రామ్‌ అబ్బరాజు తెరకెక్కించిన ఈ క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో విజయ్‌ బిగిల్‌ (తెలుగులో విజిల్‌) ఫేం రెబ్బా మౌనికా జాన్‌ కథానాయిక. వీకే నరేష్‌, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్, రఘుబాబు, రాజీవ్ కనకాల, దేవీ ప్రసాద్‌, ప్రియ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో రాజేష్ దండా నిర్మించిన సామజవరగమన జూన్‌ 23న థియేటర్లలో విడుదలైంది. ఫస్ట్‌ షో నుంచే సూపర్‌ హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్‌ వద్ద కనివినీ ఎరుగని రీతిలో కలెక్షన్లు సాధించింది. అల్లు అర్జున్‌, రవితేజ, సుమంత్‌, అడివిశేష్‌, నాగచైతన్య లాంటి స్టార్‌ హీరోలు సైతం ఈ మూవీని చూసి ఫిదా అయ్యారు. ఇలా థియేటర్లలో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచిన సామజవరగమన ఇప్పుడు ఓటీటీలోనూ అదరగొడుతోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహా శ్రీ విష్ణు డిజిటల్‌ స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఈక్రమంలో జులై 27 నుంచి సామజవరగమన ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. మొదటి 40 గంటల్లోనే ఏకంగా 100 మిలయన్లకు పైగా స్ట్రీమింగ్‌ మినిట్స్‌ను నమోదు చేసి రికార్డు సెట్‌ చేసింది.

తాజాగా ఓటీటీలో మరో రికార్డు సృష్టించింది సామజవరగమన. స్ట్రీమింగ్‌కు వచ్చేసిన మొదటి 72 గంటల్లోనే 20 కోట్ల వ్యూయింగ్ మినిట్స్ సొంతం చేసుకోవడం విశేషం. తద్వారా ఆహా ఓటీటీలో ఇంత ఫాస్ట్‌గా 20 కోట్ల స్ట్రీమింగ్‌ మినిట్స్‌ను అందుకున్న మొదటి సినిమాగా సామజవరగమన రికార్డుల కెక్కింది. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా ఆహా ఓటీటీ సంస్థ స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. దీనికి నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత అనే క్యాప్షన్‌ను జోడించింది. సామజవరగమన సినిమాకు గోపీ సుందర్‌ స్వరాలు సమకూర్చారు. మరి మీరు కూడా కడుపుబ్బా నవ్వుకోవాలనుకుంటే ఆహాలో ఉన్న సామజవరగమనను చూసేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..