AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manchu Manoj: చంద్రబాబును కలిసిన మంచు మనోజ్‌, మౌనికా రెడ్డి.. కారణమేంటంటే?

ప్రముఖ టాలీవుడ్‌ నటుడు మంచు మనోజ్‌ దంపతులు సోమవారం సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని కలిశారు. మనోజ్‌తో పాటు ఆయన సతీమణి భూమా మౌనికా రెడ్డి చంద్రబాబుతో భేటీ అయ్యారు. గత కొద్ది రోజులుగా మనోజ్‌ దంపతులు రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మనోజ్‌, మౌనిక చంద్రబాబుతో భేటీ అవ్వడం చర్చనీయాంశంగా మారింది.

Manchu Manoj: చంద్రబాబును కలిసిన మంచు మనోజ్‌, మౌనికా రెడ్డి.. కారణమేంటంటే?
Chandrababu, Manoj, Mounika
Basha Shek
|

Updated on: Jul 31, 2023 | 8:26 PM

Share

అమరావతి, జులై 31: ప్రముఖ టాలీవుడ్‌ నటుడు మంచు మనోజ్‌ దంపతులు సోమవారం సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని కలిశారు. మనోజ్‌తో పాటు ఆయన సతీమణి భూమా మౌనికా రెడ్డి చంద్రబాబుతో భేటీ అయ్యారు.  అమరావతిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన మౌనిక దంపతులు ఆయనతో సమావేశమయ్యారు.   గత కొద్ది రోజులుగా మనోజ్‌ దంపతులు రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మనోజ్‌, మౌనిక చంద్రబాబుతో భేటీ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. అయితే సమావేశం అనంతరం మాట్లాడిన మనోజ్‌ తమ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని స్పష్టత నిచ్చారు. కేవలం చంద్రబాబు ఆశీస్సులు తీసుకున్నందుకు కుటుంబ సమేతంగా వచ్చామంటూ మనోజ్‌ దంపతులు చెప్పుకొచ్చారు. కాగా మంచు మనోజ్ సతీమణి మౌనిక కర్నూలుకు చెందిన దివంగత టీడీపీ నాయకులు భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డిల కుమార్తె అన్న విషయం తెలిసిందే. మౌనిక సోదరి భూమా అఖిలప్రియ చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆళ్లగడ్డ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.

మరోవైపు మోహన్‌ బాబు సీఎం జగన్‌కు సమీప బంధువు. గత ఎన్నికల్లో ఆయన వైసీపీకి మద్దతుగా ప్రచారం కూడా చేశారు. ఇక మంచు విష్ణు సతీమణి వెరానిక కూడా వైఎస్ కుటుంబానికి దగ్గరి బంధువే. కాగా మౌనికను పెళ్లి చేసుకన్నాక మంచు మనోజ్ కూడా పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని అయితే మౌనిక ఆసక్తి చూపిస్తే మాత్రం తాను ప్రోత్సహిస్తానంటూ అప్పట్లోనే చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే  చంద్రబాబుతో ఆలుమగలు సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..