Yadamma Raju: కాలి వేలు తీసేశారు.. ప్రాణం పోయినట్లు అనిపించింది.. యాక్సిడెంట్‌పై యాదమ్మ రాజు ఎమోషనల్‌

టీవల జరిగిన స్లమ్‌డాగ్‌ హజ్బెండ్‌ మూవీ ప్రమోషన్లలోనూ చేతికర్ర సాయంతో నడుస్తూ కనిపించాడీ స్టార్ కమెడియన్. దీంతో యాదమ్మ రాజుకు అసలు  ఏమైంది? అంత పెద్దగాయం ఎలా తగిలింది? అన్న సందేహాలు తలెత్తాయి. తాజాగా తనకు జరిగిన ప్రమాదంపై స్పందించాడు జబర్దస్త్ కమెడియన్‌. బైక్‌ ఢీకొట్టడం కారణంగానే తనకు తీవ్ర గాయాలు అయినట్లు చెప్పుకొచ్చాడు.

Yadamma Raju: కాలి వేలు తీసేశారు.. ప్రాణం పోయినట్లు అనిపించింది.. యాక్సిడెంట్‌పై యాదమ్మ రాజు ఎమోషనల్‌
Yadamma Raju
Follow us
Basha Shek

|

Updated on: Jul 31, 2023 | 8:42 PM

ప్రముఖ జబర్దస్త్‌ కమెడియన్‌ యాదమ్మ రాజు ఇటీవల కాలికి పెద్ద కట్టుతో కనిపిస్తున్నాడు. ఆస్పత్రిలో చేరడం, భార్య స్టెల్లా అతనికి సేవలు కనిపించడంతో యాదమ్మ రాజుకు ఏమైందా? అని అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఇక ఇటీవల జరిగిన స్లమ్‌డాగ్‌ హజ్బెండ్‌ మూవీ ప్రమోషన్లలోనూ చేతికర్ర సాయంతో నడుస్తూ కనిపించాడీ స్టార్ కమెడియన్. దీంతో యాదమ్మ రాజుకు అసలు  ఏమైంది? అంత పెద్దగాయం ఎలా తగిలింది? అన్న సందేహాలు తలెత్తాయి. తాజాగా తనకు జరిగిన ప్రమాదంపై స్పందించాడు జబర్దస్త్ కమెడియన్‌. బైక్‌ ఢీకొట్టడం కారణంగానే తనకు తీవ్ర గాయాలు అయినట్లు చెప్పుకొచ్చాడు. ‘ కొన్నిరోజుల క్రితం టీ తాగడానికి బయటకు వెళ్లాను. అప్పుడే అటుగా బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి నన్ను ఢీకొట్టాడు. బైక్‌ స్కిడ్‌ కావడంతోనే ఈ యాక్సిడెంట్ జరిగింది. చికిత్సలో భాగంగా డాక్టర్లు కుడి కాలి వేలు తీసేశారు. తొడ భాగం నుంచి చర్మం తీసేసి వేలు దగ్గర అతికించారు. ఒక్కసారిగా ప్రాణం పోయినట్లు అనిపించింది. ఇప్పటికీ చాలా నొప్పిగా ఉంటోంది. మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొనాలి కాబట్టి ఇలా ఈవెంట్లు, ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నా’ అని జబర్దస్త్ కమెడియన్ చెప్పుకొచ్చాడు.

కాగా పటాస్‌ షోతో బుల్లితెర ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడు యాదమ్మ రాజు. తనదైన పంచులు, ప్రాసలతో టీవీ ఆడియెన్స్‌ను కడుపుబ్బా నవ్వించాడు. ఈక్రమంలోనే జబర్దస్త్‌ షోలోకి అడుగుపెట్టి మరింత క్రేజ్‌ తెచ్చుకున్నాడు. కేవలం బుల్లితెరపైనే కాకుండా బిగ్‌ స్క్రీన్‌పైనా మెరుస్తున్నాడీ కమెడియన్‌. జార్జిరెడ్డి, గువ్వాగోరింక, లక్కీ లక్ష్మణ్‌, విద్యార్థి, ఓ సాథియా అనే సినిమాల్లో నటించాడు యాదమ్మ రాజు. తాజాగా బ్రహ్మాజీ తనయుడు సంజయ్‌ హీరోగా నటించిన విడుదలైన స్లమ్‌ డాగ్‌ హజ్బెండ్‌ మూవీలోనూ ఓ కీ రోల్‌ పోషించాడు.

ఇవి కూడా చదవండి

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా